ఓట్ మీల్ ఫేస్ మాస్క్ తో భలే అందం..!

 

అమ్మాయిలు చర్మ సంరక్షణ విషయంలో అస్సలు రాజీ పడరు. అందుకే వాణిజ్య ఉత్పత్తుల నుండి ఇంటి చిట్కాల వరకు ప్రతి ఒక్కటి ఫాలో అవుతారు.   వాణిజ్య ఉత్పత్తులలో ఎక్కువ శాతం రసాయనాలుండటం వల్ల చాలామంది సహజంగా చర్మాన్ని మెరిపించుకోవడం కోసం ట్రై చేస్తారు.  అలాంటి వారికి ఓట్మీల్ చక్కని ఆప్షన్. సాధారణంగా ఆరోగ్య స్పృహ ఉన్నవారు  ఓట్మీల్ ను ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటారు. దీంతో ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలుంటాయి. కానీ దీన్ని పేస్ కు మాస్క్ లాగా వేసుకుంటే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయి. ఇంతకీ ఓట్మీల్ అంటే ఏంటి?దీన్నెలా తయారుచేసుకోవాలి?  ఎలా అప్లై చేసుకోవాలి? తెలుసుకుంటే..


ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు,  మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి  ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం. కానీ వీటితో పేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం నుండి మురికి,  నూనెను తొలగించడంలో, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో, చర్మానికి  తేమను అందించడంలో, అకాల వృద్ధాప్యానికి గురికాకుండా చేయడంలో.. ఇలా చాలా రకాలుగా సహాయపడుతుంది.


ఓట్ మీల్ తేనె ఫేస్ మాస్క్..

పొడి చర్మం,  సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ ఫేస్ మాస్క్ మంచిది.

కావలసినవి:

1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ వోట్మీల్
1 టేబుల్ స్పూన్ తేనె
1 టీస్పూన్ వెచ్చని నీరు.

విదానం..

ఒక చిన్న గిన్నెలో, గ్రైండ్ చేసిన ఓట్ మీల్, తేనెను కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.  ఈ మిశ్రమానికి గోరువెచ్చని నీరు వేసి బాగా కలపాలి.  ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి.  15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుని,  ఇష్టమైన మాయిశ్చరైజర్‌ని ముఖానికి రాసుకోవాలి.

ఓట్ మీల్ పెరుగు ఫేస్ మాస్క్..

ఈ ఫేస్ మాస్క్ అన్ని చర్మ రకాల వారికి, ముఖ్యంగా జిడ్డుగల లేదా మొటిమల బారిన పడే చర్మం ఉన్నవారికి సరిపోతుంది.

కావలసినవి..

2 టేబుల్ స్పూన్లు గ్రౌండ్ వోట్మీల్
2 టేబుల్ స్పూన్లు సాదా పెరుగు
1 టీస్పూన్ తేనె

విధానం..

ఒక చిన్న గిన్నెలో, గ్రౌండ్ వోట్మీల్,  పెరుగు కలపాలి.
ఇందులోనే  తేనె జోడించాలి.  ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసి  15-20 నిమిషాలు అలాగే ఉంచాలి.
చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖం పొడిగా మారిన తరువాత తేలికపాటి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

ఓట్ మీల్,  అరటిపండు ఫేస్ మాస్క్:

ముడుతల చర్మం ఉన్నవారికి ఈ ఫేస్ మాస్క్ సరైనది.

కావలసినవి:

1/2 పండిన అరటి
1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ వోట్మీల్
1 టీస్పూన్ తేనె

విధానం..

ఒక చిన్న గిన్నెలో, అరటిపండును మెత్తని పేస్ట్‌గా  చెయ్యాలి.  అరటిపండు గుజ్జులో గ్రైండ్ చేసిన   ఓట్ మీల్,  తేనె వేసి బాగా కలపాలి. ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుని  15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ముడుతలు ఉన్న చర్మానికి తగిన మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి.

                                                     *రూపశ్రీ.