Read more!

ఆడవారు ఈ నాలుగు పాటిస్తే.. అద్భుతమైన ఆరోగ్యం సొంతమవుతుంది!

ఆడవారు ఈ నాలుగు పాటిస్తే.. అద్భుతమైన ఆరోగ్యం సొంతమవుతుంది!

ఆడవారి ఆరోగ్యం ప్రతి ఇంటికి పెద్ద బలం. ఆడవారు తమ ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకుంటే ఇళ్లలో ఎన్నో పనులు ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతాయి. రోజువారీ జీవితంలో ఆడవారు ఫాలో అయ్యే కొన్ని విషయాలు మహిళల ఆరోగ్యాన్ని పాడు చేస్తే.. మరికొన్ని విషయాలు శారీరకంగా, మానసికంగా ఆడవారిని బలంగా మారుస్తాయి. ఆడవారు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి అంటే నాలుగు విషయాలు గుర్తుపెట్టుకొని, వాటిలో రోజూ పాటించాలి. కేవలం ఈ నాలుగు విషయాలు మొత్తం జీవన గతిని మార్చేసి అద్భుతమైన ప్రయాణానికి దోహదం చేస్తాయి. 

ఆహారం ఫుల్లుగా తినొద్దు..

ఆడవారు ఎక్కువ పని చేస్తారు కానీ బాగా తినాలి అని అందరూ చెప్పేమాట. అయితే ఆహారం ఫుల్ గా తినడం వల్ల ఆడవారిలో ఊబకాయం, మధుమేహం తొందరగా వస్తాయి. అందుకే కేలరీల పరంగా తక్కువ కేలరీలు గల ఆహారాన్ని తీసుకోవాలి.  దీనివల్ల హృదయనాళాల ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తక్కువగానే ఉంటుంది. 

వాకింగ్ పెంచాలి..

నడక అనేది తక్కువ ప్రభావ వ్యాయామం. దీని ఫలితాలు మాత్రం చాలా అగొప్పగా ఉంటాయి.  ఏ వ్యాయామం లేకపోయినా రోజూ వాకింగ్ చేసేవారి ఫిజికల్ స్ట్రేంగ్త్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, కేలరీలను బర్న్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. సాధారణ నడక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది, అభిజ్ఞా పనితీరును పెంచుతుంది.

నవ్వు గొప్ప ఔషధం..

నవ్వు నాలుగు విధాల చేటు అనే మాట ఎప్పుడో తీరిపోయింది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున నవ్వును తరచుగా ఉత్తమ ఔషధంగా సూచిస్తారు. ఇది ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి, మానసిక స్థితిని పెంచడానికి, మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అదనంగా, నవ్వు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది, ఇది అనారోగ్యాన్ని నివారించడానికి సహాయపడుతుంది. నవ్వుతూ ఉంటే మానసిక ఒత్తిడులు క్రమంగా తగ్గిపోతాయి. కాబట్టి నవ్వు గొప్ప ఔషధం.

అందరినీ ప్రేమించాలి..

ప్రేమించడం అనే మాటకు ఎప్పుడూ ఒకే అర్థం తీయకూడదు. సాటి మనుషులుగా అందరినీ అందరూ ప్రేమించవచ్చు. ఆ ప్రేమలో జాలి, కరుణ, బాధ్యత, ఒకానొక సమత్వ భావన తొంగిచూస్తాయి. సాధారణ పనులలో నిమగ్నమైన వ్యక్తులలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడం, మానసిక ఆరోగ్యం మెరుగుపరచడం, అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడం ఇలాంటి ప్రేమ వల్లనే సాధ్యమవుతుంది. ఇతరులలో ఒంటరితనం పోగొట్టి జీవితం మీద ఆశను కల్పించడంలో ఈ ప్రేమ  పాత్ర చాలా గొప్పది. కాబట్టి ఎదుటి వారితో ఆనందంగా, సంతృప్తిగా, సంతోషంగా మాట్లాడుతూ వారిని గౌరవించాలి.

ఈ నాలుగు పనులు చేస్తే ఆడవారి ఆరోగ్యం పదికాలలపాటు పధిలంగా ఉంటుంది.

                                   ◆నిశ్శబ్ద