పిల్లల ఎదుగుదలను తెలుసుకోవడం ఎలా?
posted on May 18, 2011
పిల్లల ఎదుగుదలను తెలుసుకోవడం ఎలా?
How Calculate kids growth..?
తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలలో మార్పులను చూసి చాలా బెంగపెట్టుకుంటుంటారు. వారి హైట్‌లో మార్పులు రావడంలేదని తెగబాధపడుతుంటారు. ఇక్కడ మేము చెప్పే క్యాలిక్యులేషన్‌లతో మీరు మీ పిల్లల్లో ఎదుగుదలను మీరు గమనించగలరు.
పిల్లల ఎదుగుదల ఎలాగుర్తించడం ?
** తల్లిదండ్రుల హైట్ ఎలా వుంటే పిల్లల్లో కూడా హైట్ అలాగే ఉంటుందని, దీనిని ఎవరు కూడా నియంత్రించలేరని వైద్యులు తెలిపారు. పిల్లల హైట్ దాదాపు 90శాతం తల్లిదండ్రుల హైట్‌తో సంబంధం ఉంటుంది. తల్లిదండ్రులిరువురు మంచి హైట్ ఉంటే పిల్లల్లోకూడా ఎదుగుదల బాగుంటుంది.
** పిల్లలు పుట్టినప్పుడు సహజంగా వారి పొడవు 50 సెంటీమీటర్లుంటుంది. ఒక ఏడాది తర్వాత 75 సెంటీమీటర్లకు చేరుకుంటుంది. ఆ తర్వాత ప్రతి ఏడాది 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు పెరుగుతారు. ఇలా పిల్లలు కిశోరావస్థకు చేరుకునేవరకు పెరుగుదల జరుగుతుంటుంది.
** కిశోరావస్థలో పెరుగుదల చాలా వేగంగా పెరుగుతుంది. అమ్మాయిలలోనైతే 10 సంవత్సరాలు, అబ్బాయిలలోనైతే 12సంవత్సరాల తర్వాత పెరుగుదల ప్రారంభమౌతుంది.
** పుష్టికరమైన ఆహారంతోబాటు మంచిగా వ్యాయామం చేస్తే మీ పిల్లల్లో పెరుగుదల కనపడుతుందని వైద్యులు తెలిపారు.
** టానిక్కులు, ప్రోటీన్ పౌడర్, ఇతర మందులపై ఆశపెట్టుకోకూడదంటున్నారు వైద్యులు. ఇవి బలహీనంగానున్న పిల్లలకు మాత్రమే పనికొస్తాయి.
** మరీ మీ పిల్లల ఎదుగుదల గురించి బెంగ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించండి.