పిల్లలు తెలివైనవారిగా ఎదగాలంటే ఇవి ఫాలో అవ్వాలి!
posted on Jul 10, 2023
పిల్లలు తెలివైనవారిగా ఎదగాలంటే ఇవి ఫాలో అవ్వాలి!
చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే చాలా సందడిగా ఉంటుంది. మొదట్లో పిల్లలు చాలా అల్లరి చేస్తారు. ఆ తరువాత పిల్లలు ప్రశ్నల పుట్టలు అవుతారు. వారు ఇంట్లో ఉంటే ప్రతి విషయం గురించి ప్రశ్నిస్తూనే ఉంటారు. అది ఎలా ఉంది?? ఇది ఎలా ఉంది?? అదేంటి?? ఇది ఎందుకు ఇలా ఉంది?? వంటి ప్రశ్నలు పిల్లల నుండి వస్తూనే ఉంటాయి. చాలామంది ఇలా పిల్లలు ప్రశ్నిస్తున్నప్పుడు "పెద్ధయ్యే కొద్ది నీకు అర్థమవుతాయి లే" అని తోసిపుచ్చుతారు. కానీ వారు అడిగిన వెంటనే ఆ ప్రశ్నలను పరిష్కరిస్తే వారి మనసు, వారి ఆలోచన ఎంతో చురుగ్గా మారుతాయి. పిల్లలలో ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడూ అనిచివేయకుడదు.
పనులు అప్పగించాలి..
పిల్లలు చేయదగిన చిన్న చిన్న పనులు కొన్ని ఉంటాయి. మొక్కలకు నీరు పోయడం, మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలు బయటకు తీయడం, వండుతున్న పదార్థానికి కావలసిన దినుసులు అందించమనడం. ఈ పనులు చేసేటప్పుడు పిల్లలు తల్లిదండ్రులతోనే ఉండటం వల్ల పిల్లలు ఎక్కడికో వెళ్లి ఏవైనా దెబ్బలు తగిలించుకుంటారేమో అనే భయం కూడా ఉండదు.
కొత్తగా ఉండాలి..
పిల్లలకు చేసిన పని మళ్లీ చేయాలంటే విసుగు వస్తుంది, వారు తొందరగా ఆసక్తిగా కోల్పోతారు. కాబట్టి వాళ్ళ మెదడు పదునెక్కాలంటే వాళ్లకు అప్పగించే పనులు కొత్తగా ఉండాలి. పాత పని పిల్లలకు నచ్చితే వాళ్ళే దానివైపు వెళతారు.
భాగమవ్వాలి…
పిల్లలతో తల్లిదండ్రులు భాగమైనప్పుడు పిల్లలు మరింత చురుగ్గా, ఆసక్తిగా పనులు చేస్తారు. వీలైనవరకు పెద్దలు పిల్లతో కలసి పనులు చేయాలి.
ప్రకృతికి దగ్గరగా..
పిల్లలు ఇంట్లోనే ఉంటే వారి మెదడు అంతగా ఎదగదు. ప్రకృతికి దగ్గరగా ఉన్నపుడే వారి మెదడు ఉత్సాహంగా మారుతుంది. చెట్టు, చేమ, కొండలు, నీరు ఇవి మాత్రమే కాకుండా దేవాలయాలు, మ్యూజియం, పురాణ కథలు.. ఇలా ఎన్నో పిల్లల మెదళ్ళలో పాదరసంలా మారుతాయి.
కాబట్టి పిల్లలు చురుగ్గా . వారి ఆలోచనలు ఉన్నతంగా ఉండాలంటే ఇవన్నీ ప్రతి తల్లిదండ్రి గుర్తుంచుకుని ఫాలో కావాలి.
*నిశ్శబ్ద.