మీ దాంపత్యలో మూడవ వ్యక్తి ఉన్నారని తెలుసుకోవడం ఎలా?
posted on Apr 10, 2023
మీ దాంపత్యలో మూడవ వ్యక్తి ఉన్నారని తెలుసుకోవడం ఎలా?
పెళ్లంటే జన్మజన్మల బంధంగా భావించేవారు చాలామంది. అయితే, కాలక్రమేణా ఇంత గొప్ప బంధం కూడా చీలికలు ఏర్పడుతోంది. ఇప్పటితరం వారు విడిపోవడానికి చాలా సులభంగా అంగీకారం తెలుపుతున్నారు. కారణాలు ఏమైనా విడిపోవడం తప్పనిసరిగా జరుగుతూ వస్తోంది. అయితే ఇలా భార్యాభర్తలు విడిపోవడానికి ముఖ్య కారణం భార్యలోనో.. భర్తలోనో వస్తున్న మార్పులు అనే అభిప్రాయంతో బంధాన్ని మనిషిని వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు.
అయితే ఇలా విడిపోవడానికి దారి తీస్తున్న బంధాల మధ్యలో మూడవ వ్యక్తి ప్రమేయం ఉండటం వల్లే ఎక్కువ శాతం కాపురాలు మునుగుతున్నాయి. కొన్నిసార్లు జీవిత భాగస్వాములను తోచిపుచ్చి ఆ స్థానంలో కూర్చునేవారు కొందరుంటారు. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, జెండర్ ద్వారా ఆకర్షించేవారు కావచ్చు. వీరి వల్లనే బంధాలు విరిగిపోతున్నాయి. అయితే భాగస్వాముల జీవితంలో మరొక వ్యక్తి ఉన్నాడనే విషయం ముందుగానే గ్రహిస్తే చాలావరకు బంధాలు కాపాడుకోవచ్చు. దీన్ని ఎలా గుర్తించాలంటే..
భర్త అలవాట్లు మారిపోతాయి. ఎన్నో ఏళ్ల నుండి సాగుతున్న అలవాట్లలో మార్పులు, కొత్త అలవాట్లు పుట్టడం, కొన్నింటిని విస్మరించడం చేస్తుంటారు. దీని అర్థం అవతల ఉన్న ఇంకొకమనిషి వైపు ఆకర్షించబడ్డారని. అందుకే అలా మారుతున్నారని అర్థం. భాగస్వామి మూడవ వ్యక్తి కోసం తనను తాను మార్చుకోవడం ప్రారంభిస్తాడు, అప్పుడు ఆ మూడవ వ్యక్తి మీ సంబంధంలో దూరాన్ని పెంచుతారు.
ఇంటిపట్టున ఎక్కువగా ఉండకపోవడం కూడా ఒక కారణమే.. పని ఉందని తొందరగా బయటకు వెళ్లడం, ఆ తరువాత బయటి పనుల్లో ఉన్నానని ఇంటికి రాకపోవడం, ఎప్పుడూ ఇలానే చేస్తుండటం జరుగుతుంది. ఇలా జరిగితే అతనికి అవతల స్పెషల్ పర్సన్ వేరు ఉన్నారని అర్థం.
సంబంధంలో మూడవ వ్యక్తి ఉన్నప్పుడు, కుటుంబాలకు ప్రాధాన్యత తగ్గుతుంది. పని సాకుతో టూర్లు, దూర ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభిస్తారు. ఇంట్లో ఎంత ముఖ్యమైన కార్యక్రమం ఉన్నా అతను వాటికి ప్రాధాన్యత ఇవ్వడు. మరీ ముఖ్యంగా భార్యతో సమయాన్ని గడపటానికి ఆసక్తి చూపించడు.
సాధారణంగా సోషల్ మీడియా ఖాతాలో లైఫ్ పార్ట్నర్స్ ను ట్యాగ్ చేయడం, వారిని జోడించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇంకొక రిలేషన్ ఉన్నప్పుడు తన ఖాతాను చాలా రహస్యగా మైంటైన్ చేస్తారు. లైఫ్ పార్ట్నర్ ఊసే ఎత్తడం లేదంటే సోషల్ మీడియాలో అతనిని మరొక పార్ట్నర్ గమనిస్తారనే కారణంతో మిమ్మల్ని దూరం పెట్టినట్టు.
అబద్ధం చెప్పడం మెల్లిగా ప్రారంభిస్తారు. విషయాలు దాచిపెట్టినప్పుడు, జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవడం ఆపివేసినప్పుడు, అతని జీవితంలో మరొకరు ఉన్నారని, అతను తన విషయాలను అవతలి వారితో పంచుకోవడం ప్రారంభించాడని అర్థం. ఆ మూడవ వ్యక్తి మీ సంబంధాన్ని పాడు చేస్తోందని అర్థం.
సోషల్ మీడియా ఖాతాలు, మొబైల్ ఫోన్ చాటింగ్స్ చాలా రహస్యంగా మైంటైన్ చేసుకుంటే అతని పర్సనల్ మరేదో ఉందని అర్థం.
ఈ విషయాలు గమనించుకుని ఆడవారు జాగ్రత్త పడితే వారి సంసార నావను కాపాడుకోవచ్చు.
◆నిశ్శబ్ద.