High BP can be reduced with Ginger

మందులు వాడకుండానే హై బి.పి. ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు

Home remedies to control High BP
 

హై బి.పి. నే హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. విషయమేమిటంటే మనలో చాలా మంది హై బి.పి. ఉందన్న విషయం తెలియకుండానే గడిపేస్తుంటాం. హై బి.పి. లక్షణాలు అంత తేలిగ్గా తెలియవు. హై బి.పి వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు, దాని ప్రభావం శరీరానికి ముఖ్య అవయవాలైన గుండె, కిడ్నీల పైనే మొదట పడుతుంది , అంతే కాదు ఈ హై బి.పి. ఒక లెవెల్ దాటిందంటే హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాంతకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

కాబట్టి మనం తినే ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తూ, వ్యామామం చేస్తుంటే ఈ బి.పి. నుండి మనల్ని మనం కాపాడుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఆరోగ్యానికి హాని చేసే ఆహారాన్ని, దాంతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి ఆహారం తిన్నామంటే సరి, హై బి .పి ని కూడా మనం మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చు .

వెల్లుల్లి

హై బి.పి. ని కంట్రోల్ లో ఉంచడంలో వెల్లుల్లి ఔషధంలా పని చేస్తుంది. అది బి.పి. ని తగ్గించి శరీరంలోని జీవక్రియలను సమతుల్యం చేస్తుంది . పల్స్ రేట్ , గుండె వేగాన్ని అదుపులో ఉంచుతుంది . అంతేకాదు రోజు ఉదయాన్నే పరగడుపున మూడు వెల్లుల్లి రేకులను మింగితే రోజంతా చలాకీగా ఉంచి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా దరి చేరకుండా చూస్తుంది

ఉసిరికాయ

ఉదయం పూట పరగడుపునే ఒక టేబుల్ స్పూన్ ఉసిరి రసంలో కాస్త తేనె కలుపుకుని తాగితే బి. పి. లెవెల్ అవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

నిమ్మకాయ

నిమ్మకాయ హై బి.పి. ఉన్నవారికి చాలా విలువైన ఔషధం , ఎందుకంటే ఉసిరికాయలో ఉండే విటమిన్ పి, బి. పి. ని కంట్రోల్ చేసి, రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది

ఖర్బూజ

హై బిపి నివారణలో ఖర్బూజా చాలా ముఖ్యమైన ఆహారం, ఖర్బూజా గింజలను రోస్ట్ చేసి లేదా ఎండబెట్టి తినడం వల్ల రక్త నాళాల్లో ఉన్న ప్రెజర్ తగ్గి బి.పి. కంట్రోల్ లో ఉంటుంది.

బియ్యం

చాలామంది కాస్త బరువు పెరగానే అన్నం తినడమంటేనే భయపడుతుంటారు , కానీ బ్రౌన్ రైస్ లో ఉండే కాల్షియం, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అందునా హై బి.పి ఉన్నవారికి ఇది పూర్తిగా సోడియం రహిత ఆహారం, కాబట్టి నిర్భయంగా తినవచ్చు. ఇది నరాలను రిలాక్స్ చేసి రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది.

బంగాళాదుంప

 

బంగాళా దుంపలు బి.పి. ని కంట్రోల్ లో ఉంచడంలో అద్భుతంగా పని చేస్తాయి. బంగాళాదుంపల  పొట్టు తీయకుండా ఉడికించడం వల్ల అందులో ఉండే పొటాషియం వల్ల ఉప్పు వేయకపోయినా ఉడికిన బంగాళాదుంపలు ఉప్పగా ఉండి రుచిగా ఉంటాయి. కాబట్టి బంగాళా దుంపలను రోజుకు ఒకసారైనా ఆహారంలో భాగమయ్యేలా జాగ్రత్తపడాలి.

కొత్తిమీర

కొత్తిమీర లో ఉన్న ఔషధ గుణాలు బి.పి. ని అదుపులో ఉంచుతాయి. కొత్తిమీర జ్యూస్ ను రోజుకు ఒకసారి తాగినా చాలు, బి పి కంట్రోల్ లో ఉంటుంది.

కూరగాయలు

కూరగాయల జ్యూస్ ముఖ్యంగా క్యారట్ జ్యూస్ గానీ, పాలకూర జ్యూస్ గానీ కలిపి గానీ విడివిడి గా కానీ తీసుకోవడం వల్ల బి.పి. పేషెంట్స్ కి చాలా రిలీఫ్ గా ఉంటుంది. 300 మీ.లీ. ల క్యారట్ జ్యూస్ మరియు 200 మీ.లీ. పాలకూర జ్యూస్ 500 మి.లీ. లీటర్ నీటిలో కలిపి రోజూ తాగడం వల్ల బి పి లెవెల్ లో ఉంటుంది.

పైన చెప్పిన డైట్ తో పాటు మరొక సలహా ఏమిటంటే హై బి.పి ఉన్నవారు తినే రొటీన్ ఆహారంలో కాల్షియం , ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడంతో పాటు సోడియం ఉన్న ఆహారాన్ని పూర్తిగా వదిలేసినా మంచిదే.

మరొక ముఖ్య గమనిక : హై బి. పి కేవలం మనం తినే ఆహారం వల్లే కాదు, నిద్ర సరిగ్గా లేకపోయినా, స్ట్రెస్ ఎక్కువైనా తిరగబడే అవకాశముంది, కాబట్టి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి..

హై బి పి ని నిర్లక్ష్యం చేయకండి.