గర్భవతులు ప్రయాణాల్లో ఇవి పాటిస్తే పండంటి బిడ్డ పుడతాడు!

గర్భవతులు ప్రయాణాల్లో ఇవి పాటిస్తే పండంటి బిడ్డ పుడతాడు!

మహిళల జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది తల్లి కావడం. పెళ్ళైన పరిస్థి అమ్మాయి తల్లి కావాలని అనుకుంటుంది. తాను గర్భవతినని తెలిసినప్పుడు ఎంత సంతోషపడుతుందో మాటల్లో వర్ణించలేనిది. ఒకానొక కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. అంతేనా మరొక ప్రాణాన్ని మోస్తూ ఈ ప్రపంచానికి కొత్త ప్రాణాన్ని పరిచయం చేయబోతున్నాను అనే భావం కూడా చాలా బావోద్వేగాన్ని కలిగిస్తుంది. అయితే గర్భం ధరించిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. కుటుంబ సభ్యులు తన విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రమే కాకుండా తన మీద తాను చాలా జాగ్రత్త వహించాలి. 

మరీ ముఖ్యంగా గర్భవతులకు ప్రయాణాలు అనేవి సహజం. కనీసం డాక్టర్ చెకప్ లకు అయినా వెళ్లాల్సి ఉంటుంది. కొందరికి సరైన డాక్టర్లు దగ్గర్లో లేక కాసింత దూరమే వెల్లడి వస్తుంది. గర్భం ధరించిన  మహిళలు ప్రయాణం సమయాల్లో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు…..

గర్భం ధరించిన తరువాత ఎంత కాదనుకున్నా ప్రయాణాలు తప్పవు. ఉద్యోగాలు చేసే మహిళలు అయితే కచ్చితంగా తిరగాల్సి ఉంటుంది. కాబట్టి గర్భవతులు ప్రయాణములో బాగా కాచి చల్లార్చిన నీటినే త్రాగాలి. బయటి నీరు, డ్రింక్స్, సోడాలు, ఇతర ద్రవాలు త్రాగకూడదు!! 

చాలామందికి ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడం అలవాటు ఉంటుంది. పెళ్ళయ్యి గర్భం దాల్చేవరకు అమ్మాయిల లైఫ్ స్టైల్ లో ఈ ఎత్తుమడమల చెప్పులు సాధారణం. కానీ  గర్భవతులైన స్త్రీలు ఎత్తుమడమల చెప్పులు వేసుకోకూడదు. వదులుగా, ఫ్లాట్ గా ఉండే చెప్పులు  వాడాలి!! 

గర్భవతులు వాంతులు కావడం సహజం. వేవిల్లు అని పిలిచే ఇవించెప్పలేనంత నీరసాన్ని తెచ్చిపెడతాయి. ప్రయాణములో వాంతులయ్యే అలవాటు ఉన్న వారికి గర్భ సమయములో ఇంకా పెరుగుతాయి. కాబట్టి... ముందుగానే వైద్యుని సంప్రదించి, తగిన మందులు తీసుకెళ్ళాలి.

ప్రయాణంలో ఆకలి అనేది సహజం. అయితే గర్భవతులు మాత్రం తమతో పాటు  కొన్ని రకాల  పండ్లను వెంట ఉంచుకోవాలి, ప్రయాణంలో ఆకలి అనిపిస్తే పండ్లనే తినాలి!  అంతేకానీ బస్సులు, ట్రైన్లు ఆగినప్పుడు అడ్డమైన తిండి కొనుక్కుని తినకూడదు. బయటి పదార్థాలను తినకపోవడం మంచిది!!

ఇంట్లో గర్భవతులు ఉన్నారంటే చాలామంది కాలు కింద పెట్టకుండా రెస్ట్ తీసుకోమని చెబుతుంటారు. వారి మీద ప్రేమ అలా చేయిస్తుంది. అయితే ఇలా గర్భవతులకు ఏ విధమైన పనులు లేకుండా ఒకే చోట కూర్చోమని చెప్పడం తప్పు.  గర్భవతులకు నడక మంచిది. సాధారణంగా గర్భవతులు నడుస్తున్నప్పుడు తొందరగా అలసిపోతారు.... అలా అలసట అనిపిస్తే.... ఆగి కొద్దిసేపు కూర్చుని.. అలసట తీరిన తరువాత తిరిగి నడవాలి.

పనులు చేసుకున్నా, నడిచినా గర్భవతులు బరువులు మాత్రం ఎత్తకూడదు, మోయకూడదు!! ఒకవేళ ఎత్తవలసిన పరిస్థితి వస్తే.... నిలుచున్న స్థితిలోకాక మోకాళ్ళు వంచి, కూర్చుని అప్పుడు ఎత్తాలి! కానీ బరువులు ఎత్తుకుని నడవకూడదు.

గర్భవతులు  పండంటి బిడ్డను పొత్తిళ్ళతో చూసుకొని ఆనంద పడాలంటే.... ప్రయాణములో పై పద్దతులను తప్పక ఆచరించాలి. 

                                   ◆నిశ్శబ్ద.