ముఖంపై మచ్చలు తగ్గించే బామ్మల చిట్కా

అమ్మాయిలకు తమ ముఖం అందంగా ఉండాలని ఉంటుంది. కానీ ముఖం మీద మచ్చలు, మంగు,  మొటిమల వల్ల పడిన గుంటలు.. చాలా మంది అమ్మాయిల ముఖారవిందాన్ని పాడు చేస్తుంటాయి.  ఇవన్నీ అమ్మాయిల  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే చర్మ సమస్యలు. నేటి కాలంలో వీటికి చాలా రకాల ఉత్పత్తులు మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ వీటిలో రసాయనాలు ఉంటాయి. ఈ క్రీములు వాడి విసిగిపోయిన వాళ్ళు చివరికి బామ్మల కాలం నాటి చిట్కాల దగ్గరకే వస్తారు. 

ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే లభించే పదార్థాలతో చర్మాన్ని మృదువుగా, నిగారింపుగా మార్చుకునే బామ్మల కాలం నాటి రెమెడీ ఏంటో  తెలుసుకుంటే..

కావలసిన పదార్థాలు..

శనగపిండి.. 2 స్పూన్లు (చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.

కస్తూరి పసుపు..

1/2 స్పూను (యాంటీ బాక్టీరియల్ గుణాలు మచ్చలను తగ్గిస్తాయి)

పచ్చి పాలు లేదా పెరుగు.. 

2 స్పూన్లు (లాక్టిక్ యాసిడ్ గుంటలను, మంగు మచ్చలను తేలికపరుస్తుంది)

అలోవెరా జెల్ ..

1 స్పూను (చర్మాన్ని హైడ్రేట్ చేసి గుంటలను పూడ్చడానికి సహాయపడుతుంది)

తేనె..

1/2 స్పూను (సహజమైన తేమను ఇస్తుంది)

తయారీ & వాడే విధానం..

ఫేస్ ప్యాక్ తయారీ..

ఒక శుభ్రమైన గిన్నెలో శనగపిండి, కస్తూరి పసుపు, అలోవెరా జెల్, తేనె , సరిపడా పచ్చి పాలు వేసి మెత్తని పేస్ట్‌లా కలుపుకోవాలి.

అప్లై చేయడం.. 

ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని, ఈ ప్యాక్‌ను ముఖమంతా, ముఖ్యంగా మచ్చలు , గుంటలు ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. తర్వాత.. 15 నుండి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.

స్క్రబ్బింగ్ & వాషింగ్..

ప్యాక్ కొద్దిగా ఆరిన తర్వాత, చేతులను కాస్త తడిచేసి వృత్తాకారంలో  తేలికగా మసాజ్ చేస్తూ చల్లటి నీటితో కడిగేయాలి.

ఈ చిట్కా ఎలా పనిచేస్తుంది?

మచ్చలు & మంగు..

పసుపు , పాలలోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉన్న నల్లటి మంగు మచ్చలను, పిగ్మెంటిజమ్‌ను త్వరగా తగ్గిస్తాయి.

మొటిమల గుంటలు..

అలోవెరా , తేనె చర్మ కణాలను పునరుద్ధరించి క్రమంగా గుంటల లోతును తగ్గించడంలో సహాయపడతాయి.

కాంతివంతమైన చర్మం..

శనగపిండి చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, తక్షణ నిగారింపును ఇస్తుంది.

వారానికి 2 నుండి 3 సార్లు ఈ ప్యాక్ క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. సున్నితమైన చర్మం  ఉన్నవారు ప్యాక్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

ఈ సహజమైన బామ్మల కాలపు చిట్కాతో రసాయనాలు లేని కాంతివంతమైన, మచ్చలు లేని చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.!

                           *రూపశ్రీ.