అమ్మాయిల చేతులకు సొగసును పెంచే జెల్లీ బ్యాంగిల్స్..ఇలా ధరిస్తే సూపర్..!

 


గాజులు భారతీయ మహిళల గౌరవాన్ని పెంచడంలో ఎప్పుడూ ముందుంటాయి.  సాంప్రదాయ వస్త్రధారణలో గాజులకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎంత చక్కగా రెడీ అయినా  సరే.. గాజులు లేకపోతే అమ్మాయిల రూపం వెలిసిపోయినట్టు కనిపిస్తుంది. అయితే గాజులలో కూడా చాలా రకాలు ఉన్నాయి.  వాటిలో జెల్లీ బ్యాంగిల్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.  జెల్లీ బ్యాంగిల్స్ ఎంతో ఆకర్షణగా, చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఎన్ని రకాల గాజులు మార్కెట్లోకి వచ్చినా, ఈ జెల్లీ బ్యాంగిల్స్ కు ఉన్న లుక్ వేరు. ఇవి చాలా నార్మల్ గా ఉంటూనే చాలా మంచి క్లాసీ లుక్ ను ఇస్తాయి. ఎలాంటి దుస్తులకు అయినా మ్యాచ్ అవుతాయి.  జెల్లీ గాజుల ఎఫెక్ట్ రాబోయే పెళ్లిళ్ల సీజన్ లో మరింత అద్బుతంగా ఎలివేట్ అవుతుంది.  అయితే ఈ గాజులను ఎలా ధరించాలి?  కాంబినేషన్లు ఎలా ఉంటే బాగుంటుంది? వివరంగా తెలుసుకుంటే..

గులాబీతో మిక్స్డ్ మ్యాజిక్..

ఎవరైనా తమ లుక్ ను కలర్పుల్ గా ఉంచుకోవాలన్నా, ఫెస్టివర్ సెలబ్రేషన్ మోడ్ ను  జోడించాలనుకున్నా, నీలం, ఊదా, నారింజ రంగులలోని గాజులను గులాబీ రంగుతో జత చేయడం చాలా మంచి ఛాయిస్. ఈ కాంబినేషన్ సాదా సూట్లు, పూల కుర్తీలు, అనార్కలీలు , చీరలతో అద్భుతంగా కనిపిస్తుంది.  ఈ కలర్ కాంబోను ఇతర రంగులతో కూడా ట్రై చేయవచ్చు.

గోల్డ్ బ్యాంగిల్స్..

బంగారు సాదా గాజుల ట్రెండ్ పాకిస్తాన్‌లో చాలా ఫేమస్. ఆ తర్వాత భారతదేశంలో కూడా వేగంగా ఫేమస్ అవుతోంది. ఒకవైపు ప్లెయిస్ గా ఉంటూనే సింపుల్ అనిపించినా, మరొకవైపు రాయల్ లుక్ ను ఇస్తూ   ఏ సాంప్రదాయ దుస్తులకైనా సులభంగా సెట్ అవుతాయి. వాటి మెరుపు పండుగ వాతావరణాన్ని మరింత పెంచుతుంది. అవి ఆఫ్-వైట్, క్రీమ్, బ్లాక్,  మెరూన్ రంగులతో మరింత అందంగా కనిపిస్తాయి.  బరువుగా ఉన్న ఆభరణాలు ధరించడానికి ఇష్టపడని వారు ఇదిగో ఈ గోల్డ్ బ్యాంగిల్స్ మాత్రమే  మొత్తం లుక్ ను  క్లాసీగా మార్చేస్తాయి.

మల్టీ కలర్ జెల్లీ బ్యాంగిల్స్..

ఆహ్లాదకరమైన, ట్రెండీ లుక్ కావాలి అనుకునేవారు, రంగురంగుల గ్లాస్ జెల్లీ బ్యాంగిల్స్ ధరించడం చాలా మంచి ఛాయిస్.. గులాబీ, నీలం, పసుపు, ఆకుపచ్చ , ఊదా వంటి రంగుల కాంబినేషన్స్ అన్ని రకాల ఎత్నిక్ , ఫ్యూజన్ దుస్తులతో చక్కగా సరిపోతాయి. కాలేజీ అమ్మాయిల నుండి యువతులు , ఉద్యోగ మహిళల వరకు, ప్రతి ఒక్కరూ వీటిని సులభంగా ధరించవచ్చు.  పండుగల నుండి,  సాధారణంగా బయటకు వెళ్ళే సందర్భాలకు కూడా ఇవి చాలా బాగుంటాయి.

ఊదా రంగు..

లేత గులాబీ, ఊదా , పసుపు వంటి లేత రంగులతో పాటు, ఊదా రంగు గాజులు కూడా  చాలా బాగుంటాయి.  చాలామంది మహిళల చాయిస్ లిస్ట్ లో ఇవి ఉంటాయి.  ఎంతో అట్రాక్షన్ గా, సింపుల్ గా ఉండే వీటి లుక్  ఇండో-వెస్ట్రన్ , సాంప్రదాయ దుస్తులు రెండింటికీ చక్కగా సరిపోతుంది. వీటిని లావెండర్, తెలుపు, గులాబీ , వెండి వంటి రంగులతో జత చేయవచ్చు.

ట్రాన్పరంట్ గ్లాస్ బ్యాంగిల్స్..

 మినిమలిస్ట్ గా,  మెస్మరైజింగ్  లుక్ ను ఇష్టపడే అమ్మాయిలు ట్రాన్పరంట్  జెల్లీ గాజులను ప్రయత్నించవచ్చు. వీటి వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. అవి ఏ రంగుతోనైనా సులభంగా సరిపోతాయి. వాటిని తెలుపు, పాస్టెల్, ప్లవర్, లేదా భారీగా ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులతో ధరించడం వల్ల శుభ్రమైన , క్లాసీ లుక్ వస్తుంది. అవి ఆఫీస్, పార్టీ , రోజువారీ వాడకానికి కూడా ఎంతో బాగుంటాయి.

అట్రాక్టీవ్ జెల్లీ గ్లాసెస్..

ఒకే సెట్‌లో చాలా  రంగులలో ఉండే జెల్లీ గాజులు ఈ రోజుల్లో బాగా ఫేమస్ అవుతున్నాయి.   దుస్తులకు సరిపోయేలా వాటిని కలిపి ధరించవచ్చు, లేదా ఒకే రంగులో ఉన్న చాలా  గాజులను ధరించి ఒక స్పెషల్ లుక్ ను  క్రియేట్ చేసుకోవచ్చు . ఈ గాజులు ముఖ్యంగా పండుగలు, శ్రావణ మాసం,  పెళ్లిళ్లు, హల్దీ ఫంక్షన్లు  వంటి వాటికి,  ఇతర ఉత్సవ సందర్భాలకు చాలా అందంగా ఉంటాయి. వాటి నిగనిగలాడే ముగింపు మరియు ప్రకాశవంతమైన రంగులు మొత్తం రూపాన్ని తాజాగా మరియు స్టైలిష్‌గా చేస్తాయి.

కాశ్మీరీ గాజులతో మరింత అట్రాక్టీవ్ గా..

ఇష్టమైతే గాజు గాజులను కాశ్మీరీ గజ్జెల గాజులతో కూడా జత చేయవచ్చు. ఇది మరింత ఫెస్టివల్ లుక్ ఇస్తుంది. సిల్వర్  కాశ్మీరీ గాజులను లేత రంగు గాజులతో జత చేయాలి, అలాగే బంగారు గజ్జెల గాజులను ఎరుపు , ఆకుపచ్చ వంటి రంగులతో ధరించవచ్చు. ఈ కాంబినేషన్  గాజు గాజుల అందాన్ని కూడా పెంచుతుంది.


                           *రూపశ్రీ.