దాల్చిన చెక్కతో అనారోగ్యానికి చెక్
posted on Jan 24, 2015
దాల్చిన చెక్కతో అనారోగ్యానికి చెక్
* దాల్చిన చెక్కని ఓ మసాలా దినుసుగా వాడతాం. అయితే అందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా వున్నాయి. దాల్చిన చెక్కకు బ్యాక్టీరియాను నిరోధించే శక్తి వుంది. కాబట్టి మనం తాగే నీటిలో ఓ చిన్న దాల్చిన చెక్క ముక్క వేస్తే బ్యాక్టీరియాకి చెక్ చెప్పినట్టే.
* ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో చిన్న చెమ్చా దాల్చిన చెక్క పొడి, ఒక చెమ్చా తేనె కలుపుకుని తాగితే తరచూ ఇన్‌ఫెక్షన్లు రాకుండా వుంటాయిట.
* ఇక కీళ్ళ నొప్పులతో ఇబ్బందిపడేవారు రోజు ఒక అర టీ స్పూను పొడిని ఒక స్పూను తేనెలో కలుపుకుని తాగితే నొప్పులు తగ్గుతాయి.
* రోజువారీ వంటలో కొద్దిగా దాల్చిన చెక్క చేర్చితే చాలు అరుగుదల సమస్యలు వుండవు.
* దాల్చిన చెక్కలో వుంటే మాంగనీసు, డయాటరీ ఫైబర్, ఐరన్, కాల్షియం... ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరమైనవే. కాబట్టి దాల్చిన చెక్కని ఎన్ని రకాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చో ఆలోచించండి.
-రమ