Childhood Fears and Anxieties
posted on Dec 3, 2014
పిల్లల్లో భయానికీ ఇదీ ఒక కారణం
పిల్లలకి రకరకాల భయాలు వుండటం సహజం. ఏ చిన్న సంఘటనో పసి మనసులపై ఆ ముద్ర వేస్తుంది. అయితే నిద్రలో కలవరిచటం, భయపడి లేవటం, అరవటం వంటి సమస్యలతో తరుచూ పిల్లలు భాదపడుతుంటే, ఒక్కసారి వారు టి.విలో, నెట్ లో చూసే ప్రోగ్రామ్స్ ఏంటో తెలుసుకోండి అంటున్నారు నిపుణులు. హీరోయిజంతో కూడుకున్నవి, హింసని చుపించే, ఫైటింగులు ఎక్కువుగా వున్నవి. చూసే అలవాటు ఉన్న పిల్లల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు ఎక్కువుగా ఉంటున్నట్టు గుర్తించారు. ఓ అధ్యయనంలో నిద్ర పోవటానికి గంట ముందు చూసే కార్యక్రమాలు పిల్లల నిద్రపై ప్రభావాన్ని చూపిస్తాయట. మనసుని ఆహ్లాదపరిచే కార్యక్రమాలు చూస్తే కంటినిండా నిద్ర పట్టే అవకాశం ఎక్కువట. పిల్లల కార్యక్రమాలే కదా అని చాలా వాటిని పేరెంట్స్ పెద్దగా పట్టించుకోరు. అయితే ఆ కార్యక్రమాలో చూపించే సాహసాలు, హింస, పిల్లల మనసుపై ప్రభావాన్ని చూపిస్తాయి అంటున్నారు. "సీటెల్ చిల్డ్రన్స్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్" పరిశోధకులు సరిపడినంత నిద్ర లేనప్పుడు పిల్లలు త్వరగా అలసిపోతారు, ఏకాగ్రత తగ్గుతుంది. చదువులో వెనకబడతారు, చిరాకు, కోపం ఎక్కువగావుంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏవైనా పిల్లల్లో కనిపిస్తే దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ నిద్రలేమి, నిద్రలో కలవరింతలు వంటివి గుర్తిస్తే పిల్లలు చూసే కార్యక్రమాలు ఏంటో పరిశిలించి వారిని వాటి నుంచి నెమ్మదిగా మళ్లించాలి. వినటానికి చిన్న సమస్యగా వున్నా పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై నిద్ర చూపించే ప్రభావం చాలా వుంటుంది కాబట్టి అశ్రద్ధ చేయకూడదు అని గట్టిగా చెబుతున్నారు వీరు.