బరువు తగ్గాలంటే ఈ పండ్లు తినాల్సిందే!
posted on Jun 22, 2023
బరువు తగ్గాలంటే ఈ పండ్లు తినాల్సిందే!
అధిక బరువు అంటే కాస్త భయపడాల్సిన కాలమిది. అధిక బరువు ఉన్నవారికి మధుమేహం, క్యాన్సర్, థైరాయిడ్ వంటి అనేక జబ్బులు సులువుగా వస్తాయి. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య కాసింత ఎక్కువ ఉంటుంది. ఈ కారణంగా బరువు తగ్గడానికి రకరకాల డైట్ ప్లాన్‌లు ఫాలో అవుతుంటారు. జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టిస్తారు. అయితే ఎక్కువ శ్రమ లేకుండా పొట్ట తగ్గాలంటే, ఆహారంలో పండ్లను ఎక్కువగా చేర్చుకోవాలి.
చాలా పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా 8 రకాల పండ్లు బరువు తగ్గడంతో మ్యాజిక్ చేస్తాయి. అవేంటో తెలుసుకుంటే..
ద్రాక్ష..
ద్రాక్షపండులో కేలరీలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇది బరువు తగ్గించే పండుగా పరిగణించబడుతుంది . ఇది రోజువారీ కావాల్సిన విటమిన్ సి లో 51% అందిస్తుంది. ఇందులో తక్కువ చక్కెర ఉంటుంది. అందువల్ల బరువు నియంత్రణలో సహాయపడుతుంది. దీని వాడకం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది.
యాపిల్స్..
యాపిల్స్ లో క్యాలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒక పెద్ద ఆపిల్‌లో 5.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. యాపిల్స్ తినే వ్యక్తులు 4 సంవత్సరాల కాలంలో ప్రతిరోజూ సగటున 0.56 కిలోల బరువు కోల్పోతారని పరిశోధనలో తేలింది.
బెర్రీస్..
ఇవి తక్కువ కేలరీల పండ్లు. ఒక కప్పు రాస్ప్బెర్రీస్ లో కేవలం 64 కేలరీలు కలిగి ఉంటే, ఒక కప్పు స్ట్రాబెర్రీలో 50 కంటే తక్కువ కేలరీలు ఉంటాయి. వీటిలో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. బెర్రీలు తినడం వల్ల కొలెస్ట్రాల్, బిపి, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది అధిక బరువు నియంత్రించడానికి సహాయపడుతుంది.
కివి..
కివి పండ్లు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కివీస్ విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా కలిగి ఉంటాయి. 12 వారాల పాటు రోజూ కివిని తింటే ఎంత ఎక్కువ ఉన్న బిపి అయినా తగ్గుతుంది. పొట్ట కొవ్వు, నడుము కొవ్వు కూడా గణనీయంగా తగ్గిస్తుంది.
పుచ్చకాయ..
పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుంది. ఇది కాకుండా, నారింజ వంటి పండ్లు కూడా అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అరటిపండ్లు, అవకాడోలు, పీచెస్, ప్లమ్స్, చెర్రీస్, ఆప్రికాట్ వంటి పండ్లు కూడా బరువు తగ్గడానికి గొప్ప ఎంపికలు.
◆నిశ్శబ్ద