చలికాలంలో పసిపిల్లల సెన్సిటివ్ హెయిర్ కోసం ఇలా కేర్ తీసుకోండి..!

చలికాలంలో పసిపిల్లల సెన్సిటివ్ హెయిర్ కోసం ఇలా కేర్ తీసుకోండి..!

 


పిల్లల ఆరోగ్యం విషయానికి వస్తే చలికాలంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. పొడి,  చల్లని గాలి నుండి పిల్లల చర్మాన్ని రక్షించడమే కాదు, వారి జుట్టును   ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. చలికాలంలో పొడి గాలి తలలో తేమను తగ్గిస్తుంది. దీని వల్ల దురద సమస్య పెరగడమే కాకుండా జుట్టు కూడా పాడవుతుంది. పెద్దవాళ్లు బయటకు చెప్పుకున్నట్టు, సమస్యను గురించి ఆలోచించినట్టు పిల్లలు ఆలోచించలేరు. వ్యక్తం చేయలేరు. అందుకే చిన్న పిల్లల విషయంలో తల్లులే ముందు జాగ్రత్తలు  తీసుకోవాలి.

పిల్లలు తమ తలను పదే పదే గోకడం, చిరాకుగా అనిపించడం లేదా పిల్లవాడు తన తలను పదేపదే తాకడం  గమనించినట్లయితే, అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు వైద్యులు సూచించిన, పిల్లలకు రెకమెండ్ చేయబడిన షాంపూ ఉత్పత్తులను మాత్రమే వాడాలి.  సాధారణంగా చలికాలంలో జుట్టు సమస్యలు పెరుగుతాయి. తక్కువ ఉష్ణోగ్రతలు,  పొడి గాలితో పాటు ఇంట్లోని వేడి పిల్లల చర్మం, తలలో తేమను కోల్పోయేలా చేస్తుందని చిన్న పిల్లల నిపుణులు అంటున్నారు. ఇది చాలా దుష్ప్రభావాలను కలిగిస్తుంది. పిల్లల  తల చర్మం పెద్దవారి కంటే చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే  అది చాలా తొందరగా పొడిగా మారడం, పొరలుగా మారడం,  దురద పెరగడం వంటి వాటికి దారి తీస్తుంది.  

చలికాలంలో పిల్లలకు ఎంత తరచుగా తల స్నానం చేయించాలి?

చిన్న పిల్లల నిపుణుల ప్రకారం.. అవసరాన్ని బట్టి పిల్లలకు   జుట్టును వారానికి ఒకటి లేదా రెండుసార్లు తలస్నానం చేయించడం  సిఫార్సు చేశారు.

పిల్లలకు స్నానం చేయడానికి గది ఉష్ణోగ్రత లేదా గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. ఇది కాకుండా, జుట్టు కడగడానికి ముందు లేదా తర్వాత, బేబీ సేఫ్ ఆయిల్‌తో తలపై తేలికగా మసాజ్ చేయాలి. ఇది స్కాల్ప్‌కు పోషణను అందిస్తుంది,  సరైన రక్త ప్రసరణను నిర్వహిస్తుంది.


                            *రూపశ్రీ.