English | Telugu
ప్రేమలో భక్త కన్నప్ప
Updated : Apr 9, 2014
సునీల్ హీరోగా "భక్త కన్నప్ప" అనే చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ మే రెండో వారం నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ... కృష్ణంరాజు గారి "భక్త కన్నప్ప"కి, మా సినిమాకు అసలు ఎలాంటి సంబంధం లేదు. మాది ఒక గిరిజన ప్రేమకు సంబంధించిన కథ అని అన్నారు. ఇక నుండి రెగ్యులర్ గా సినిమాలు చేస్తానని, ఈ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాలు కూడా చేయడానికి అంగీకరించాను అని తెలిపారు. మరి ఈ కన్నప్ప సునీల్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో త్వరలోనే తెలియనుంది.
