Read more!

English | Telugu

కొత్తగా మొదలైన రిషిధార ప్రేమకథ.. జగతి పసిగట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -723లో.. వసుధార, రిషి మళ్ళీ తమ మొదటి పరిచయం నుండి జర్నీ మొదలు పెట్టి స్వచ్ఛమైన, దాపరికాలు లేని ప్రేమని పొందాలని అనుకుంటారు. ఇలా చేస్తున్నట్టుగా ఎవరికి చెప్పొద్దని అనుకుంటారు. ఇక రిషి ఉదయం లేచి కాలేజీకి రెడీ అయి వస్తుంటే.. చిన్న మావయ్య, అత్తయ్య, వసుధార వాళ్ళు కాలేజీకి వెళ్లిపోయారని ధరణి చెప్తుంది. అవునా నేను కూడా వెళ్తున్నా అని బయల్దేరుతాడు రిషి. ఈ వసుధార ఆల్రెడి క్యారెక్టర్ లోకి వెళ్లినట్లుందని అనుకొని.. ఇట్స్ బిగిన్ అని వసుధారకి మెసేజ్ చేస్తాడు రిషి. ఒకే సార్ అని రిప్లై ఇస్తుంది వసుధార. ఇక కాలేజీకి ఎప్పుడు రిషితో వెళ్లే వసుధార.. మాతో వస్తుందేంటని జగతికి డౌట్ వస్తుంది. మళ్ళీ వీళ్ళిద్దరికి ఏమైంది గొడవ పడ్డారా అని జగతి తన మనసులో అనుకొని.. వసు ఆర్ యూ ఓకే అని అడుగుతుంది. ఓకే మేడం ఎందుకలా అడుగుతున్నారు అని వసుధార అంటుంది. 

వసుధార మొదటి రోజు కాలేజీ కి వచ్చినట్లుగా భావించి, జగతి మేడం ఇచ్చిన రికమండేషన్ లెటర్ పట్టుకొని రిషి కోసం ఎదురుచూస్తుంది. ఇక రిషి కార్ వచ్చి కాలేజీ ముందు ఆగుతుంది. అందులో నుండి రిషి కళ్ళజోడు పెట్టుకొని స్టైల్ గా ఒక ఆటిట్యూడ్ తో నడిచివస్తుంటే.. వసుధార గమనించి, రిషి వెనకాల వస్తూ.. సర్ ఐ ఆమ్ వసుధార ఈ కాలేజీ లో అడ్మిషన్ కావాలని వసుధార అడుగుతుంది. మీ అడ్మిషన్ అప్లికేషన్ బాక్స్ లో ఇవ్వండి అది బాగుంటే వాళ్ళే పిలుస్తారని రిషి సమధానమిస్తాడు. సర్.. ఇది జగతి మేడం ఇచ్చిన రికమండేషన్ లెటర్ అని చూపించాగానే.. రిషి గతంలో జగతిని తిట్టిన మాటలు గుర్తుచేసుకుంటాడు. రికమండేషన్ లెటర్ చింపేసి రిషి లోపలికి వెళ్తుంటే.. జగతి చూస్తుంది. దాంతో జగతి దగ్గరకి రిషి వచ్చి.. సారీ మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు. జగతికి రిషి ఎందుకు సారీ చెప్పాడో అర్ధం కాదు. వసుధార దగ్గరికి వెళ్లి ఏం జరిగిందని అడుగుతుంది. రిషి మన మధ్యలో జరిగిన ఒప్పందం గురించి ఎవరికి చెప్పద్దు అన్న విషయం గుర్తు చేసుకొని.. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను మేడం అని వసుధార అంటుంది.

వసుధార రిషి ఇద్దరు గ్రౌండ్ కి వెళ్ళి బాస్కెట్ బాల్ ఆడతారు. కాసేపు మళ్ళీ వారి మధ్య ఉన్న ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. మనం పూర్తిగా మన గతంలోకి వెళ్తేనే.. మనం దగ్గర అవుతాం. ఇక గతంలోనే ఉందామని చెప్పి రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్ళి.. వసు కోసం చూస్తే ఎక్కడా కనిపించదు. నేను అలా అన్నానని కొంపతీసి ఇల్లు వదిలి వెళ్లిపోయిందా అని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.