Read more!

English | Telugu

పెళ్ళి తర్వాత వాసంతి కృష్ణన్ మొదటి ప్రాజెక్ట్ అదేనా?

కొందరు సెలబ్రిటీలు పెళ్ళి తర్వాత ఫ్యామిలీతో బిజీ అయిపోతుంటారు. సినిమాల్లో, సీరియల్స్ లో చేసేవారు ఎక్కువగా నటించకుండా ఇంటికే పరిమితమవుతారు. అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్ మాత్రం పెళ్ళి తర్వాత కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తోంది. అవేంటో తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వ్లాగ్ ద్వారా చెప్పుకొచ్చింది. 

తిరుపతికి చెందిన వాసంతి.. నటనపై ఆసక్తితో ముందు కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తరువాత సిరిసిరి మువ్వలు, గోరింటాకు వంటి సీరియల్స్‌తో పాపులర్ అయ్యింది. అనంతరం సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన కాలీఫ్లవర్ చిత్రంలో నటించింది. గేమ్ ఆన్, భువన విజయం వంటి చిత్రాల్లో నటించింది. అయితే వాసంతి సినిమాలు, సీరియల్స్ కంటే కూడా బిగ్ బాస్ ద్వారానే ఎక్కువగా క్రేజ్ దక్కించుకుంది. ఎలాంటి నెగిటివిటీ లేకుండా.. బిగ్ బాస్ హౌస్‌లో తన అందచందాలతో ఆకట్టుకుంది. బీబీ జోడీలో తన డాన్స్ పర్ఫామెన్స్‌తోనూ అబ్బురపరిచిన వాసంతి కృష్ణన్ తన ప్రియుడు పవన్ కళ్యాణ్‌ని పెళ్ళి చేసుకుంది‌.

అయితే తాజాగా స్టార్ మాలో మొదలైన నీతోనే డ్యాన్స్ షో లో తన సత్తా చాటుతోంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో ఫేమ్ లోకి వచ్చిన యావర్ తో జతకట్టింది ఈ భామ. పెళ్ళి తర్వాత సినిమాలు, సిరీస్ లు ఏవీ చేయట్లేదేంటని కొందరు సబ్ స్క్రైబర్స్ అడుగుతున్నారని.. వారందరికి సమాధానిమిచ్చింది‌. బిబి జోడీ కంటే ఈ షో చాలా కష్టంగా ఉందని.. చాలా శ్రమించాల్సి వస్తుందని, మధ్యమధ్యలో గ్యాప్ తీసుకొని షార్ట్ వీడియోస్ చేస్తున్నట్టుగా వాసంతి చెప్పుకొచ్చింది. అయితే త్వరలోనే మంచి ప్రాజెక్టుతో మీ ముందుకొస్తానని వాసంతి చెప్పింది. మరి మీలో ఎంతమందికి వాసంతి కృష్ణన్ తెలుసో కామెంట్ చేయండి.