English | Telugu

యాక్ట‌ర్లూ అంత ఓవరాక్షన్ వ‌ద్దు! వైర‌ల్ అయిన టీవీ న‌టి పోస్ట్‌!!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. అందరూ వ్యాక్సిన్ కోసం కోవిడ్ సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు టీకా తీసుకుంటూ దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన ఎలాంటి ప్రాణహాని ఉండదంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ఇక్కడవరకు బాగానే ఉంది కానీ.. వ్యాక్సిన్ తీసుకుంటూ కొందరు సెలబ్రిటీలు చేసే ఓవరాక్షన్ చూడలేకపోతున్నామంటూ ప్రముఖ టీవీ నటి ఆషా నేగి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరీ అంత ఓవర్ యాక్టింగ్ అవసరం లేదని.. చాలా చిరాకుగా ఉంటుందంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసిందో చెప్పలేదు. కానీ ఈ పోస్ట్ పై స్పందించిన పలువురు నెటిజన్లు నటి అంకిత లోఖండే గురించని అభిప్రాయ పడుతున్నారు.

ఇటీవల అంకిత వ్యాక్సిన్ తీసుకుంటూ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె భయపడుతూ, దేవుడిని ప్రార్ధిస్తూ టీకా వేసుకుంది. దీంతో పాటు ఆమె మరొక సెటైర్ కూడా వేసింది. "ఇక అంతా అడుగుతున్నారు.. వీడియోగ్రాఫర్‌ ని మీరే తీసుకువెళ్తారా.. లేక ఆస్పత్రి వాళ్లే ఏర్పాటు చేస్తున్నారా అని'' అంటూ పోస్ట్ చేసింది ఆషా.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.