Read more!

English | Telugu

ప్రభాస్ కామెంట్ చేస్తేనే నా కెరీర్ మీద ఫోకస్ చేస్తాను...


ఢీ షో ఈ వారం ఎంతో స్మూత్ గా ఎంటర్టైనింగ్ గా సాగింది. ఐతే ఇందులో ఆది పాన్ ఇండియా లెవెల్ లో మూవీ తీస్తున్నట్లు చెప్పాడు. అందులో నటించడానికి పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న హీరోయిన్ కావాలని దానికి కోసం ఆడిషన్స్ చేయడానికి వచ్చినట్లు చెప్పాడు ఆది. ఇక ఢీ లేడీ కంటెస్టెంట్స్ అందరినీ స్టేజి మీదకు హీరోయిన్స్ సెలెక్షన్స్ కోసం నందు పిలిచాడు. ఐతే సునంద, రాకీ, ఆదర్శ్ మాత్రమే వచ్చి పాన్ ఇండియా స్టార్ ఎవరు ఎవరు అంటూ ఆదిని అటు తోసేసి ఇటు తోసేసి కాసేపు స్టేజి మీద హడావిడి చేసాడు.

"ఇలాంటి పాన్ ఇండియా స్టార్ పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి ఎలా ఉండాలి మరి" అని నందు అడిగేసరికి "ముసిల్ది ఐనా కానీ తప్పట్లేదు భయ్యా" అని ఫన్నీ కామెంట్ చేసాడు ఆది. "పొరపాటున ఎవరూ దక్కక శ్వేతా నాయుడే నాకు దిక్కవుతుందని భయంగా ఉంది" అని ఆది అన్నాడు. వెంటనే శ్వేత స్టేజి మీదకు వచ్చి "అంత మాట ఎలా అంటావ్ ఆది. నెక్స్ట్ నా రీల్ మీద పాన్ ఇండియా స్టార్  ప్రభాస్  కామెంట్ చేస్తాడు తెలుసా...ప్రభాస్ కామెంట్ చేస్తే నేను నా కెరీర్ మీద ఫోకస్ చేస్తానని ఒక కొత్త రీల్ పెట్టాను " అని చెప్పింది శ్వేతా. "అసలు ఫోకస్ చేసేంత కెరీర్ మనకుందా" అని కౌంటర్ వేసాడు ఆది. ఇక సునంద దగ్గరకు వచ్చాడు ఆది. "కాదు ఆది నువ్వు హీరో అంటున్నావ్ కదా బయట ఉన్న క్యారవాన్ నీదేనా" అని అడిగింది. " నాదే " అన్నాడు ఆది. "మరి నేను వెళ్తుంటే ఎవడో నన్ను ఆపేస్తున్నాడు" అంది సునంద. "ఎవడూ ఆపట్లేదు..నువ్వే క్యారవాన్ లోకి పట్టక అక్కడే ఆగిపోతున్నావ్" అంటూ బాడీ షేమింగ్ డైలాగ్స్ వేసాడు ఆది. దాంతో సునంద షాకయ్యింది.