Read more!

English | Telugu

ఆ వెన్న చిలికి నా కన్నుకి పెట్టాలనుకుంటున్నాను!

ఈ వారం సూపర్ క్వీన్ ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. ఇప్పుడు దీని ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రెట్రో థీమ్ పేరుతో సూపర్ క్వీన్స్ తో గేమ్స్ ఆడించాడు హోస్ట్ ప్రదీప్. సమ్మర్ వచ్చిందంటే చాలు పల్లెటూళ్లలో ఎలాంటి ఆటలు ఆడతారో అవన్నీ ఏ షోలో ఆడించాడు. సుహాసిని వెన్న చిలుకుతూ కనిపించింది..పవిత్ర గెటప్ చూసి ప్రదీప్ దెయ్యాలు భయపడేలా ఉన్నవేంటి అని ఫన్నీ డైలాగ్ వేసాడు. తర్వాత ప్రదీప్ ముంజెలతో చేసిన చక్రాన్ని విద్యుల్లేఖకు చూపించి ఏ చెట్టుకు ఇవి వుంటాయో తెలుసా అన్నాడు...కొబ్బరి చెట్స్ అని కామెడీగా చెప్పింది. తర్వాత "ఛాంగురే బంగారు రాజా" మూవీ టీం ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.

అలాగే సమ్మర్ అంటే చాలు ఏడాదికి సరిపడా వడియాలు ఇంటి మేడ మీద కనిపిస్తూ ఉంటారు చాలామంది...ఈ షోలో కూడా సూపర్ క్వీన్స్ అందరితో వడియాలు పెట్టించాడు ప్రదీప్. ఈ వడియాల టేస్ట్ చూసి చెప్తాడంటూ కార్తిక్ రత్నంని పిలిచేసరికి ఆయన అలా వెళ్ళినట్టే వెళ్లి తిరిగి వెనక్కి వచ్చేసాడు. సమ్మర్ లో జరిగే ఎగ్జిబిషన్స్ లో కనిపించే ఆటలు కూడా ఆడించాడు. పుల్లైసులు, రంగురంగుల గోలి సోడాలు తాగారు సూపర్ క్వీన్స్. తర్వాత భీముడి ఆకారంలో ఉండే ఇద్దరినీ పిలిచి రెండు భారీ కొబ్బరి మట్టల మీద కూర్చోబెట్టి ఆ మట్టల్ని ఈడ్చుకెళ్లాలంటూ ప్రశాంతికి, కండక్టర్ ఝాన్సీకి టాస్క్ ఇచ్చాడు. పాపం వాళ్ళు మొదట్లో లాగలేకపోయారు కానీ తర్వాత ఎలాగోలా ఇచ్చిన టాస్క్ పూర్తి చేశారు. ఇలా ఈ వారం సూపర్ క్వీన్ షో వెరైటీ గేమ్స్ తో ఫన్నీ థీమ్స్ తో అలరించడానికి సిద్ధంగా ఉంది.