English | Telugu

షోస్ వదిలేసి పొలం పనుల్లోకి యాంకర్ సుమ

 

సుమ ఎం మాట్లాడిన ఎం చేసినా వెరైటీగా  ఉంటుంది. ఇప్పుడు సుమ టీవీని వదిలిపెట్టి పొలాల్లో పంట పండించడానికి వెళ్ళింది. అదేంటి అనుకుంటున్నారా..నిజం అండి. సుమ రైతక్కలతో కలిసి ఆడుతూ పాడుతూ వ్యవసాయం చేసింది. మనం రోజూ తినే ఆహారం వెనక రైతుల కష్టం ఏంటో ఉంది అంటూ వాళ్లకు సెల్యూట్ చేసింది. పొలంలోకి దిగి వరి డబ్బులు నాటింది. "ఒక గంట పని చేస్తేనే నేను అలిసిపోయాను. రోజంతా నడుం వంచి పని చేసే వీళ్లకు ఎంత బలం ఉండాలో..నిజంగా ఇంటి పనులను, వ్యవసాయాన్ని ఇలా సమర్ధించుకుంటూ చేయడం చాలా గొప్ప విషయం..వాళ్లందరికీ నా జోహార్లు.." అంటూ వాళ్లకు దణ్ణం పెట్టింది సుమ. ఈ వీడియోని సుమ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. "నాకు వ్యవసాయం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతిగా ఉంటుంది.

ఎందుకంటే అది  ప్రకృతితో ముడిపడి ఉంటుంది.. కొన్నిసార్లు మనం కూడా వెళ్లి మట్టిలో పని చేసి ఆ మట్టిని అనుభూతి చెందాలి. మీరు మా కోసం చేస్తున్న దానికి రైతులందరికీ..నమస్కరిస్తున్నాను ..అందరికీ నా ధన్యవాదాలు, మాకు మీరు ప్రతిరోజూ కావాలి".. అంటూ కాప్షన్ పెట్టింది.  ఇక నెటిజన్స్ అంతా ఆమెను తెగ పొగిడేస్తున్నారు.  "ఇలా వర్క్ చేస్తే యోగ అవసరం ఉండదు..నిజంగా సుమక్కేనా.. కానీ వ్యవసాయం చేసినా విలువ లేదు. ఎవరూ గుర్తించరు..చిన్న చూపు చూస్తున్నారు..సుమ గారు వ్యవసాయం కూడా టచ్ చేశారా..మీరు గ్రేట్ అండి..మంచి నిర్ణయం తీసుకున్నారు." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.