Read more!

English | Telugu

అవినాష్ పరువు తీసిన శ్రీముఖి!

 

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈసారి ఎపిసోడ్ కి బీబీ జోడి టాప్ 5 జోడి కంటెస్టెంట్స్ వచ్చారు. వీళ్ళ డాన్సులు, పంచ్ డైలాగ్స్ నవ్వు తెప్పించాయి. పటాస్ ఫైమా వచ్చి షోని తన స్టైల్లో యాంకరింగ్ చేసి స్టార్ట్ చేసింది. రా అక్కా ఇంకా చూస్తావేంటి "ఫైమా కొట్టింది కప్పు ...నువ్వొచ్చి కొట్టు డప్పు" అని హోస్ట్ శ్రీముఖిని పిలిచింది. శ్రీముఖి రావడంతోనే సెలెబ్రేషన్స్ దేనికి అని అడిగింది "బీబీ జోడి విన్నర్ ఇక్కడ" అని ఫైమా ఆన్సర్ చేసింది. "ఈ ప్రోగ్రాంకి మాత్రమే హోస్ట్ ని కాదు ఈ పార్టీకి కూడా హోస్ట్ ని నేను" అని చెప్పింది శ్రీముఖి.  "ఈరోజు పార్టీ ఫ్రీ..డబ్బులు కట్టకుండా ఎంతైనా ఫ్రీగా తిని వెళ్లొచ్చు" అని అనౌన్స్ చేసేసరికి అవినాష్, ఎక్స్ప్రెస్ హరి స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చి పిచ్చి డాన్స్ ఒకటి చేశారు. "నీ ముఖంలో రన్నర్ ఐన బాధకన్నా కూడా ఫ్రీగా ఫుడ్ దొరుకుతోంది అన్న ఆనందమే ఎక్కువగా కనిపిస్తోంది..సిగ్గుండాలి మనిషన్నాకా " అని శ్రీముఖి అవినాష్ పరువు తీసేసింది.

ఇక ఆ మాటలకు ఫీలైన హరి "అన్నా పార్టీకి పిలిచింది పరువు తియ్యడానికే..అర్ధం చేసుకో వెళ్ళిపోదాం" అని ఆ ఇద్దరూ వెళ్లిపోయారు. కొంచెం దూరం వెళ్లేసరికి అవినాష్ మనసు తిండి మీదకు లాగేసింది "వెళ్తూ వెళ్తూ తినేసి వెళదాం రా" అనేసరికి హరి నవ్వేసాడు. టాప్ 5 జోడి కంటెస్టెంట్స్ ఐన ఆర్జే సూర్య-ఫైమా, అవినాష్-అరియనా, మెహబూబ్-శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్-వాసంతి, ఆర్జే చైతు-ఆర్జే కాజల్ వచ్చారు. "మీ అందరికీ ఇంకోసారి గుర్తు చేస్తున్న విన్నర్ ఫైమా-సూర్య, రన్నర్ అరియనా-అవినాష్" అని వాళ్ళను శ్రీముఖి  చూపించేసరికి "థర్డ్, ఫోర్త్ కంటే రన్నర్ బెటర్  ఎందుకంటే సెకండ్ ప్లేస్ కదా అని కన్విన్స్ చేసాడు" అవినాష్. "కానీ నువ్వు ఆ రన్నర్ గా రావడం వలన ఆ రన్నర్ పొజిషన్ కే పరువు పోయిందన్నమాట" అని మళ్ళీ పరువు తీసేసింది శ్రీముఖి. మీకొకటి చెప్పాలి "మీకు గాలిపటం కనిపిస్తుంది కానీ దాని కింద ఉన్న దారం కనిపించదు కదా ఆ దారం అవినాష్..ఎందుకంటే తాను రన్నర్ అయ్యాడు కాబట్టే నేను విన్నర్ అయ్యాను  " అని ఫైమా చెప్పేసరికి అవినాష్ నోరెళ్లబెట్టాడు. తర్వాత "ఎన్నో రాత్రులొస్తాయి కానీ" అనే సాంగ్ కి మెహబూబ్-శ్రీసత్య హాట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక లేడీస్ అందరినీ ఒక వైపు నిలబెట్టి ఒక్కో అబ్బాయి గురించి అడుగుతాను..వాళ్ళు ఒకేనా కాదా..ఎందుకు ఒకే కాదో చెప్పండి అని చెప్పింది శ్రీముఖి. సూర్య గురించి చెప్పాలంటే ఆ కసి, ఆ ఫీలింగ్స్ రావు, ఆర్జే చైతు - మంచి కసి అని చెప్పారు తరువాత "నేను మైండ్ లో ఒకతన్ని అనుకున్నాను ఆ పర్సన్ వచ్చేవరకు"...అని శ్రీసత్య చెప్పేసరికి "ఐనా మీకు మేమెందుకు కనిపిస్తాంలే..మీకు ఆయనే కనిపిస్తాడు" అంటూ చైతు డైలాగ్ వేసాడు.

అవినాష్ గురించి చెప్పండి అనేసరికి "మాకు అవినాషే కావాలి అని లేడీస్ అంత ఎగిరారు" "ఇక్కడ ఉన్న ఆరుగురు అమ్మాయిలతో ఎవరితో నువ్వు రాకీ కట్టించుకోవాలి అనుకుంటున్నావు" అని శ్రీముఖి అడిగేసరికి "రాకీ పండగ ఎప్పుడో ఐపోయింది ఇప్పుడు అవసరం లేదు" అన్నాడు అవినాష్. "కాదు మాకు గిఫ్టులు కావాలి" అంది శ్రీసత్య. రాకీ లేదు కాబట్టి లేడీస్ మనమంతా అన్నయ్యా అని ఒకేసారి పిలిచేస్తే ఐపోతుంది కదా అంది శ్రీముఖి మిగతా లేడీస్ తో కలిసి అన్నయ్య, అన్నయ్య అని పిలిచారు. తర్వాత గాల్లో ఎగిరే జాంగ్రీ తినే పోటీ పెట్టింది శ్రీముఖి. ఇలా ఈ ఆదివారం ఈ షో ఆడియన్స్ ని మస్త్ ఎంటర్టైన్ చేయబోతోంది.