Read more!

English | Telugu

సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు కొరియోగ్రాఫర్స్

ఢీ ఛాంపియన్ షిప్ బ్యాటిల్ క్వాటర్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టేసింది. కంటెస్టెంట్స్ అంతా కూడా అద్భుతంగా డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ వారం క్వాటర్ ఫైనల్స్ కి టీం బి నుంచి అమిత్, కుమార్, పండు, చైతన్య మాస్టర్స్ పోటీ పడ్డారు. చివరికి అమిత్ ఎలిమినేట్ అయ్యాడు. మిగతా ముగ్గురు సేఫ్ జోన్ లోకి వెళ్లారు. లాస్ట్ వీక్ జరిగిన క్వాటర్ ఫైనల్స్ లో టీం ఏ నుంచి గ్రీష్ణ, సోమేష్, సుదర్శన్, రేవంత్ మాస్టర్స్ పోటీ పడగా సుదర్శన్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఇలా మొత్తం ఆరుగురు కొరియోగ్రాఫర్స్  ఢీ-15 సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 

ఈ వారం అమిత్ ఎలిమినేట్ ఐన విషయం తెలిసేసరికి స్టేజి మీద ఏడ్చేశాడు. టిసిఎస్ లో సాఫ్ట్ వెర్ ఇంజినీర్ గా పని చేస్తూ డాన్స్ మీద ఇంటరెస్ట్ తో కొరియోగ్రఫీ చేస్తూ రెండిటిని బాలన్స్ చేస్తూ ఫస్ట్ టైం ఈ స్టేజి మీద పెర్ఫార్మ్ చేసాడు, చేయించాడు, క్వాటర్ ఫైనల్స్ వరకు వచ్చాడు అని అమిత్ గురించి చెప్పాడు హోస్ట్ ప్రదీప్. ఇక తన టీమ్ అందరినీ స్టేజి మీదకు పిలిచి "సారీ మీ అందరికీ...టైటిల్ కొడదామనుకున్నా..నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను" అని చెప్పాడు అమిత్. 

నెక్స్ట్ వీక్ ఈ ఆరుగురు సెమీఫైనల్స్ లోకి ఎంటర్ కాబోతున్నారు. ఇక ఢీ షోలో కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేసి కెరీర్ లో కొరియోగ్రాఫర్స్ గా సక్సెస్ ఐన వాళ్ళే  ప్రెజెంట్  జడ్జెస్ గా ఉన్నారు. మరి ఈ ఆరుగురు కొరియోగ్రాఫర్స్ నుంచి ఫైనల్స్ కి ఎవరు వెళ్తారో తెలియాలి అంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.