Read more!

English | Telugu

హనీమూన్ రోజు బాగా ఏడిపించాం...

 

సింగర్ శ్రీరామచంద్ర అంటే తెలియని వారంటూ ఎవరూ లేరు. అలాంటి శ్రీరామా చంద్ర రీసెంట్ గా దావత్ అనే కార్యక్రమంలో కనిపించాడు. ఆ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు టైం అంతా ఖాళీనే కాబట్టి సింగర్ కం డాన్సర్ కం యాక్టర్ ని... నేను ఏ పార్టీకైనా, ఫంక్షన్ కైనా వెళ్ళినప్పుడు ఎవరైనా పాట పాడమని అడుగుతుంటే నాకు పెళ్లి చూపులకు వెళ్లినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికెళ్లినా చుట్టూ అమ్మాయిలే ఉంటారు.

అందుకే అందరూ నన్ను చుక్కల్లో చంద్రుడు అంటారు..ఇక పేరెంట్స్ అంటారా పడిపోయిన ఏ అమ్మాయినైనా లేపరా అని అంటూ ఉంటారు. ఒకసారి ఒక లేడీ  ఫ్యాన్ తన బట్టలు సర్దుకుని ఇంటికొచ్చేసింది. మా అమ్మ ఫుల్ పరేషాన్ ఐపోయి నాకు ఫోన్ చేసింది. ఎం చేస్తున్నావురా నువ్వు ఇంటికొచ్చేస్తున్నారు నీ ఫాన్స్ అంతా అని కంగారు పడిపోయింది. మేజిక్ ఎం చెయ్యట్లేదు కానీ  కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ ఉంటాను. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో ఊర్మిళ గారిలా సైకో లవర్స్ ఉంటారు కొంతమంది... అలాంటి వాళ్ళను హ్యాండిల్ చేయడం చాలా కష్టం...ఒక్కసారి  మా ఫ్రెండ్ కి మ్యారేజ్ అయ్యింది. అతని హనీమూన్ టైంలో ఒక అల్లరి పని చేసాం. ఐతే వాళ్ళ రూమ్ లో ఒక కప్ బోర్డు ఉంది. మేమేం చేసామంటే ఒక ఐదు అలారంలు తీసుకుని ప్రతీ పది పదిహేను నిమిషాలకు టైం ఫిక్స్ చేసి వాటిని ఆ కప్ బోర్డులో పెట్టేసి తాళం వేసేసి వచ్చేసాం. ఇక మూడు నాలుగు గంటల సేపు ఆ అలారంలు అలా మోగుతూనే ఉన్నాయి. ఇండియన్ ఐడల్ కి వెళ్లేముందు అందరూ కూడా ఏదైనా 9 టు 5 చేసే సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకోమంటూ  సలహా ఇచ్చారు. ఐతే ఇండియన్ ఐడల్ నుంచి కప్ తీసుకుని వచ్చాక మళ్ళీ వాళ్ళే కంగ్రాట్యులేషన్స్ అన్నా బాగా పాడావ్ అంటూ పొగిడేశారు... తెలుగోడి సత్తా చూపించనావ్ అన్నా అనేసరికి దూల తీరింది ఎదవకి అనిపించింది నాకు. యాంకరింగ్ చేసినా, పాటలు పాడినా, డాన్స్ చేసినా నీ యవ్వా తగ్గేదేలే" అన్నాడు శ్రీరామచంద్ర.