Read more!

English | Telugu

స్టేజి మీద శ్రీహాన్, సిరి ముద్దులు....

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సీనియర్ మోడల్స్ వర్సెస్  జూనియర్ మోడల్స్ వచ్చారు. సీనియర్ మోడల్స్ గా ఇంద్రనీల్, నంద కిషోర్, కరుణా భూషణ్, కౌశిక్ వచ్చారు...జూనియర్ మోడల్స్ గా సిరి హన్మంత్, లాస్య, అమర్, ప్రియతమ్ వచ్చారు..ఈ మధ్య స్మాల్ స్క్రీన్ మీద ఫైమా, ఎక్స్ప్రెస్ హరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్టుగా మంచి బిల్డప్ ఇస్తున్నారు. ఈ షోలో కూడా శ్రీముఖి కూడా అదే చెప్పింది "ఫైమా అంటే నాకిష్టం ఫైమాని టచ్ చేస్తే నా వల్ల కాదు అని చెప్పేయొచ్చు కదా" అనేసరికి తల బాదుకున్నాడు హరి.

ఆ కామెంట్ కి ఇంకొంచెం వెయిట్ పెంచడానికి అన్నట్టుగా అవినాష్ వచ్చాడు మధ్యలో "సీరియస్ గా మేము ఇంతకు ముందు బయటికి వెళ్ళినప్పుడు...అన్నా ఎందుకో తెలీదు ఫైమా అంటే చిన్న ఫీలింగ్ కలుగుతోంది నాకు" అని చెప్పేసరికి ఫైమా వెళ్లి హరిని హగ్ చేసేసుకుంది. తర్వాత ఈ షోలోకి "ఆవారా జిందగీ" మూవీ టీం వచ్చారు. ఇందులో హీరో శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ వచ్చారు. "ఈ ఎపిసోడ్ కే రావడానికి కారణం ఏమిటి" అని శ్రీహాన్ ని శ్రీముఖి అడిగింది.

"శ్రీముఖి ఉందని వచ్చా" అని ఫన్నీగా చెప్పాడు. దాంతో "శ్రీముఖి ఉందనా ఇంకెవరన్నా ఉన్నారనా అంటూ కళ్ళజోడు పైకి తీసి సిరి హన్మంత్ ని చూపించేసరికి" నోరెళ్లబెట్టాడు. సిరి నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగమని రిక్వెస్ట్ చేసింది అని చెప్పింది శ్రీముఖి "సిరిని ఎక్కువగా తిట్టుకున్న సందర్భం" అని అడిగేసరికి " నన్ను నీట్ గా ఉండమని చెప్తుంది తాను మాత్రం పాటించదు" అని శ్రీహాన్ చెప్పేసరికి లై డిటెక్టర్ మెషిన్ అరిచింది. "ముద్దు అడిగినప్పుడు ముద్దు ఇవ్వదు" అప్పుడు తిట్టుకుంటా అని చెప్పాడు. "సిరి

పక్కనుండగా వేరే అమ్మాయి నచ్చిందా" అనేసరికి ఫైమా "ప్లీజ్ నా పేరు చెప్పకు" అని కామెడీగా "శ్రీహాన్ డేట్ చేసిన అమ్మాయిలు ఎంత మంది" అని అడిగేసరికి " ఒక అమ్మాయి వెంటపడడం, డేట్ చేయడం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లడం ఈ మూమెంట్స్ నా లైఫ్ లో లేవు " అని చాలా సీరియస్ గా చెప్పేసరికి సిరి హన్మంత్ వెళ్లి ముద్దు పెట్టేసింది...ఇలా ఈ వారం షో ఫుల్ కలర్ ఫుల్ గా, జోష్ తో ఎంటర్టైన్ చేయబోతోంది.