Read more!

English | Telugu

నాకు పెళ్లి వద్దు..కానీ బ్రిట్టో లాంటి అబ్బాయి కావాలి

నీతోనే డాన్స్ 2 .0 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో బ్రిట్టో-సంధ్య పెర్ఫార్మెన్స్ అద్దిరిపోయింది. వీళ్ళ డాన్స్ స్టైల్ కి జడ్జెస్ ఫిదా ఐపోయారు. బాహుబలి మూవీ నుంచి "ధీవర" అనే సాంగ్ కి కొత్త స్టైల్ లో వీళ్ళు డాన్స్ చేసి అందరినీ మెప్పించారు. ఇక బ్రిట్టో చేసిన డాన్స్ కి శుభశ్రీ ఫుల్ ఖుషీ ఐపోయింది. "చాలా బ్యూటిఫుల్ గా ఉంది డాన్స్..నా లైఫ్ లో కూడా ఒక బ్రిట్టో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా" అని అనేసరికి "ఓ మై గాడ్" అని శ్రీముఖి, జడ్జెస్ అంతా షాకైపోయారు. "బ్రిట్టో లాంటి హజ్బెండ్ కావాలని కోరుకుతున్నావన్నమాట" అని శ్రీముఖి అడిగేసరికి "హజ్బెండ్ కాదు అబ్బాయి..పెళ్ళొద్దు నాకు" అని చెప్పేసింది శుభశ్రీ.

ఇక బ్రిట్టో వచ్చిరాని తెలుగులో "నో నో సారీ థిస్ జన్మ నో.. నెక్స్ట్ జన్మ ఓకే" అనేసరికి సదా అంతా కూడా నవ్వేశారు. ఇక లాస్ట్ వీక్ నీతోనే డాన్స్ సీజన్ 2 లాంచింగ్ ఎపిసోడ్ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో 10 పెయిర్స్ ని టు టీమ్స్ గా డివైడ్ చేసి ఆ టీమ్స్ కి కూడా రెండు పేర్లు పెట్టింది శ్రీముఖి. తగ్గేదెలా టీమ్ లో శిశిర్ - సిరీన్, మానస్ - శుభశ్రీ, బ్రిట్టో - సంధ్య , నితిన్ - అక్షిత, కుమార్ సాయి - శ్వేతా ఉండగా తస్సాదియ్యా టీమ్ లో యావర్ - నయనిపావని, బాలాదిత్య - పూజ, ప్రిద్వి శెట్టి - దర్శిని గౌడ, విశ్వ - నేహా చౌదరి, ఏక్నాథ్- హారిక ఉన్నారు. ఇక వీళ్ళ మధ్య ఈ సీజన్ నడవబోతోంది. ఈ సీజన్ లో రీల్ , రియల్, సీరియల్ , బిబి జోడీస్ పార్టిసిపేట్ చేశారు. నీతోనే డాన్స్ సీజన్ 1 చాలా హ్యాపీగా ఎండ్ అయ్యింది ఇందులో ఆట సందీప్- జ్యోతి టైటిల్ గెలుచుకుని వెళ్లారు.