Read more!

English | Telugu

ఆ పాత్ర కోసం తను అలా మారిపోయానని చెప్పిన షానూర్ సనా బేగం!

సీనియర్ నటి షానూర్ సనా బేగం. వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించింది. ప్రతి ఇంట్లోని ఒక అమ్మలా కనిపించే సన.. అందరికి  సుపరిచితమే. వెండి తెరపై సపోర్ట్ రోల్స్, తల్లి పాత్రలలో ఇమిడిపోయి అందరిని మెప్పిస్తుంది సనా. తను ఇప్పటివరకు దాదాపు అందరు అగ్రహీరోల సినిమాలల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి పేరు సంపాదించుకుంది.

సనా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై నటించి.. తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. మొదటగా నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ 'నిన్నే పెళ్లాడతా' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పటివరకు తన కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది సన. అంతేకాకుండా బుల్లితెరపై అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'చక్రవాకం' సీరియల్ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన సిరి సిరి మువ్వలు సీరియల్ లో.. ఉమెన్ లీడ్ రోల్ చేసింది సనా. తాజాగా తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి.. తన అప్డేట్స్ ని ప్రేక్షకులకు తెలియజేస్తుంది. సీరియల్ యాక్టర్ సమీరాని తన కొడుకుకి ఇచ్చి వివాహం చేసింది సనా.

ఆ తర్వాత ఇద్దరు అత్తాకోడళ్ళు కలిసి తన యూట్యూబ్ ఛానెల్ లో మహిళలకు ఉపయోగపడే చిట్కాలు చెప్తున్నారు. తను ఇప్పటికే చాలా సినిమాల్లో నటించినా.. కెరీర్ లో ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా ఇప్పటివరకు చిన్న పాత్ర, పెద్ద పాత్ర అని తేడా లేకుండా దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది సనా.

అంతేకాకుండా మదర్స్ డే సందర్బంగా ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో సనా కనిపించింది. ఆ పాటలో ఒక నిరుపేద తల్లిగా నటించింది. ఒక పేద తల్లికి, కొడుకుపై ఉన్న ప్రేమని ఒక పాట రూపంలో చిత్రీకరించారు మేకర్స్. ఈ పాటలో సన తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. మేకప్ లేకుండా నిజంగా పేదవాళ్ళు ఎలా ఉంటారో.. అలా రావాలని కొరియోగ్రాఫర్ చెప్పాడంట.. దాంతో ఆ పాత్రకి న్యాయం చేయడం కోసం తను వందశాతం ఇవ్వాలని ఆ పాత్రకి తగ్గట్టుగా రెడీ అయిందంట సనా.

అలా ఆ పాత్రలో ఇమిడిపోయిన సనా.. ఈ పాత్ర గురించి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఆల్బమ్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని షేర్ చేసి తన అనుభవాన్ని చెప్పింది. ఈ సాంగ్ కి నేను బెస్ట్ ఇవ్వాలని చేశాను‌. నా హార్డ్ వర్క్ కి టీం సపోర్ట్ ఉంది. ఈ సాంగ్ క్లోజ్ టూ మై హార్ట్. థాంక్యూ టూ ఆల్  అంటూ తన అనుభవాన్ని షేర్ చేసింది సనా. తన ఫొటోస్ ని చూసిన నెటిజన్లు.. నిజంగా ఆ పాత్రకి న్యాయం చేసారండి, సూపర్ సాంగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.