Read more!

English | Telugu

కాబోయే వాళ్ళను పరిచయం చేస్తాను అన్న ప్రదీప్

సర్కార్ సీజన్ 3 ప్రదీప్ కామెడీతో షోకి వచ్చే కంటెస్టెంట్స్ పంచ్ డైలాగ్స్ తో ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తోంది. ఈ వారం ఈ షోకి గీత సుబ్రహ్మణ్యం సీజన్ 3  వెబ్ సిరీస్ నుంచి  సుప్రజ - అభిజ్ఞ, అర్దమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ నుంచి  తేజస్విని మాదివాడ- హర్షిత్ వచ్చారు. వీళ్ళతో గేమ్ ఆడించాడు ప్రదీప్. మధ్యమధ్యలో పంచ్ డైలాగ్స్ కూడా బాగా పేలాయి. ఈ వారం కోటి రూపాయల ప్రశ్నకు ఆన్సర్ చెప్పలేకపోయింది అభిజ్ఞ..అలా ఈ వారం ఈ రెండు టీమ్స్ గెలవలేదు. "గీత సుబ్రహ్మణ్యం" టీమ్ నుంచి ఇద్దరూ వచ్చి కాసేపు మల్లెపూలు పట్టుకుని  డాన్స్ చేశారు.

"అర్దమయ్యిందా అరుణ్ కుమార్" టీమ్ నుంచి ఇద్దరూ వచ్చి రెడ్ రోజెస్ తో ప్రొపోజ్ చేసుకున్నారు. "ఎంత గెలిచాము అనే దాని కంటే కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాం.. కొంత ఇన్ఫర్మేషన్ గేదర్ చేసాం...ఇంకొంచెం ఫన్ చేసాం" అని చెప్పి ఫైనల్ సెగ్మెంట్ లో అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చాడు. "రియల్ మీ ఆస్క్ మీ ఎనీ థింగ్ సెగ్మెంట్ లో సర్కార్ 1 , 2 , 3 చూసాం...మీ ఇంటికి మీ సర్కార్ ని ఎప్పుడు తెచ్చుకుంటారు" అని అడిగేసరికి " ఓహో పెళ్లి గురించి అడుగుతున్నారా..పెళ్లి చేసుకుంటే వాళ్ళే మనకు సర్కార్ కాబట్టి సర్కార్ 100 వ సీజన్ లో మీకు పరిచయం చేస్తాను అని కోరుకుంటూ...సెల్ మన చేతిలో ఉంటుంది కానీ ప్రశ్న మన దగ్గర ఉంటుంది కానీ సమాధానం మన దగ్గర ఉండదు కదా..హలో  తధాస్తు దేవతలారా వింటున్నారా..మా వాళ్ళు నా పెళ్లి గురించి అడుగుతున్నారు...వాళ్ళు ఓకే అనగానే నేను పెళ్లి చేసుకుంటాను" అని చాలా కామెడీగా చెప్పాడు ప్రదీప్..బుల్లితెర మీద మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ గా ప్రదీప్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రష్మీ, విష్ణుప్రియ,  లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు.  వీళ్ళు పెళ్లి చేసుకోకుండా  బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.  ఆడియన్స్, ఫాన్స్ పెళ్ళెప్పుడు అంటూ అడుగుతుండడంతో ప్రభాస్ పెళ్లయ్యాక చేసుకుంటాం అని చెప్పి తప్పించుకుంటూ ఉంటారు.