Read more!

English | Telugu

పంచమికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన సదా, రాధ.. కాపీ షోస్ ఎన్నో వచ్చాయి కానీ...

నీతోనే డాన్స్ 2.0 నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. అన్ని జోడీస్ కూడా అద్భుతంగా డాన్స్ పెర్ఫార్మ్ చేసి జడ్జెస్ ని మెప్పించారు. ఇక సదా లాస్ట్ వీక్ ఎవరి పెర్ఫార్మన్స్ బాలేదు అని చెప్పిందో ఈ వారం వాళ్లంతా ఇరగదీయబోతున్నారన్న విషయం ఈ ప్రోమో ద్వారా తెలుస్తోంది. 

ఇక లాస్ట్ లో నాగపంచమి సీరియల్ హీరోహీరోయిన్స్ దర్శిని గౌడ, ప్రిద్వి శెట్టి ఇద్దరూ పెర్ఫార్మ్ చేశారు. దర్శిని గౌడ చంద్రముఖి గెటప్ లో వచ్చి డాన్స్ చేసింది. పృద్వి అమీర్ ఖాన్ నటించిన పికె మూవీ గెటప్ వేసుకుని వచ్చాడు. ఈ డాన్స్ కానీ గెటప్ కానీ వాళ్ళ ఆటిట్యూడ్ కానీ చూడడానికి చాలా సిల్లీగా అనిపించింది. జడ్జ్ రాధ కూడా అదే కామెంట్ చేసింది మీరిద్దరూ చాలా నిరుత్సాహపరిచారు.. స్కూల్ కి వెళ్లే చిన్నపిల్లలు చేసినట్టుగా ఉంది డాన్స్ అని సీరియస్ గానే చెప్పేసింది. "ఈ ఒక్క స్టేజిని మీరు సింపుల్ గా తీసుకోవద్దు" అని చెప్పింది రాధా. ఇక సదాకి కూడా దర్శిని మీద చాలా కోపం వచ్చేసింది "దర్శిని నీకే చెప్తున్నా. సీనియర్ ఆటిట్యూడ్ ని నువ్వసలు లెక్క చేయడం లేదు. నీ ఆటిట్యూడ్ అస్సలు బాలేదు." అని సీరియస్ అయ్యేసరికి వెంటనే దర్శిని గౌడ "నోనో సారీ" అని ఆపాలజీ చెప్పింది. 

ఇక లాస్ట్ లో ఏక్నాధ్ - హారిక వచ్చి పెర్ఫార్మ్ చేశారు. ఆ డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. సదా ఐతే సీట్ లోంచి లేచి వచ్చి తన దగ్గర ఉన్న రెండు గోల్డెన్ హార్ట్స్ ని ఇద్దరికీ ఇచ్చేసింది. ఈ డాన్స్ జోడికి అటు మిగతా జోడీస్ నుంచి ఇటు జడ్జెస్ నుంచి కూడా ఫుల్ మార్క్స్ పడ్డాయి. నెటిజన్స్ కూడా ఏక్-హరి తెగ పొగిడేస్తున్నారు. ఫైనల్ గా శ్రీముఖి ఒకటి చెప్పింది మన షోకి ఎన్నో కాపీ షోస్ వచ్చాయి. కానీ నీతోనే డాన్స్ 2 .0 ఒరిజినల్ అంటూ గట్టిగా అరిచి చెప్పింది.