Read more!

English | Telugu

రాజ్ పెళ్ళిచూపులు.. కనకాన్ని కంగారు పెట్టిన అక్కబావ ఫోటో

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్.. రీసెంట్ గా మొదలై టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ ఎపిసోడ్ -22 లోకి అడుగుపెట్టింది. కాగా శుక్రవారం నాటి ఎపిసోడ్ లో రాహుల్ ఫోన్ చేసి స్వప్నని రమ్మనడంతో.. స్వప్న వెళ్తుండగా కనకం ఎక్కడికని చెప్పి అపుతుంది. అప్పుడే కృష్ణమూర్తి రావడంతో అతను ధరించిన బట్టలు చూసి.. "ఈ అవతారమేంటి" అని లోపలికి తీసుకొని వెళ్తుంది. ఇదే సందు అన్నట్టుగా బయటికి జారుకుంటుంది స్వప్న. "నీ బట్టలు కాకుండా ఈ సూట్ వేసుకో" అని కృష్ణమూర్తిని అనగా.. "నా మనసు మార్చుకున్నాను కాని ఈ బట్టలు మార్చుకోను" అని కృష్ణమూర్తి సూటిగా చెప్పేస్తాడు.

మరోవైపు రాహుల్ ఫ్లర్టింగ్ కు పడిపోయి అతను చెప్పిన ఈవెంట్ కి వెళ్తుంది స్వప్న. అక్కడ కొందరు గర్ల్స్ వచ్చి స్వప్నతో సెల్ఫీలు తీసుకోవడంతో తను మురిసిపోతుంది. రాహుల్ నన్ను మహారాణిలా చూసుకుంటున్నాడని అనుకుంటుంది. స్వప్న పూర్తిగా నా మాయలో పడిపోయిందని రాహుల్ అనుకుంటాడు. మరోవైపు పెళ్ళిచూపులకు వచ్చిన రాజ్ ఫ్యామిలీకి దగ్గర ఉండి మర్యాదలు చేస్తుంది కనకం. అప్పుడప్పుడు నోరు జారుతుంది. మళ్ళీ కవర్ చేస్తూ వస్తుంటుంది. కానీ రుద్రాణికి మాత్రం దొరికిపోతూనే ఉంటుంది. మాటిమాటికి మీనాక్షి "ఇది నా చెల్లెలు ఇల్లు" అనడంతో రాజ్ ఫ్యామిలీకి డౌట్ వస్తుంది.

మీనాక్షి, తన భర్త ఫోటో గోడకు ఉండటం రాజ్ వాళ్ళ అమ్మ గమనిస్తుంది. అది చూసి మీ అక్కబావల ఫోటో మీ ఇంట్లో ఉందేంటని రాజ్ వాళ్ళ అమ్మ అడుగుతుంది. "నాకు మా అక్కబావ దైవంతో సమానం.. ఈ ఇల్లు మా అక్క వాళ్ళకి రాసిచ్చేసి.. మేము జూబ్లీహిల్స్ కి షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాం" అని కనకం కవర్ చేస్తుంది. కాసేపటికి "మీ భర్త లండన్ నుండి వచ్చారా?" అని రాజ్ వాళ్ళ అమ్మ అడుగగా.. హా వచ్చారని తీసుకోస్తుంది. కృష్ణమూర్తి వాలకం చూసి రాజ్ వాళ్ళ అమ్మకి డౌట్ వస్తుంది. మా ఆయనకి సింపుల్ గా ఉండడమంటేనే ఇష్టం అంటూ కవర్ చేస్తుంది కనకం. మరోవైపు కావ్య పిండివంటలు పట్టుకొని ఇంటి దగ్గరికి వస్తుంది. అది కనకం చూసి తొందరగా బయటకు వచ్చి.. "నువ్వు ఎందుకు వచ్చావే" అని కనకం అడుగగా.. అప్పు రాలేదమ్మా.. అందుకే నేనే తీసుకొచ్చానని కావ్య అంటుంది. సరేగని అవన్ని వెనక డోర్ నుండి వెళ్ళి పెట్టేసి వెళ్ళమని కనకం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.