Read more!

English | Telugu

కిర్రాక్ ఆర్పీ మీద రాకింగ్ రాకేష్ సెన్సేషనల్ కామెంట్స్!

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచెస్ ని ఓపెన్ చేస్తూ ఫుల్ జోష్ ఉన్న కిర్రాక్ ఆర్పీ మీద మరో జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ఒక ఇంటర్వ్యూలో  షాకింగ్ కామెంట్స్ చేసాడు. కిరాక్ ఆర్పీ ఫుడ్ బిజినెస్ పెట్టి ఫుల్ ఫేమస్ అయ్యాడు దాని సక్సెస్ కి జబర్దస్త్ కారానంటారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు...ఎవరు ఏం చేసినా అది జబర్దస్త్ బిక్షే. నేను ఇప్పటి వరకు ఆయన్ని కలవలేదు...వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళను కలిసేంత అదృష్టం నాకు  లేదు నేనేదో చిన్న ఆర్టిస్టుని అని సెటైర్లు వేశారు. అప్పట్లో కిరాక్ ఆర్పీ మల్లెమాల సంస్థ మీద ఆరోపణలు చేశారు. దానికి మీరేమంటారు ? అని అడిగేసరికి  జనాలకు తెలుసండి. ఈ విషయం గురించి మాట్లాడటం వలన టైం వేస్ట్ అని అన్నాడు. వెళ్లిపోయిన జబర్దస్త్ కమెడియన్స్ అంతా తిరిగి వస్తారు అనే విషయం గురించి మాట్లాడుతూ… అది మేము ఏర్పాటు చేసుకున్న వేదిక. 

11 ఏళ్ళ నుంచి నేను అక్కడే ఉన్నాను. ఈమధ్యలో చాలామంది వెళ్లారు, మళ్ళీ వచ్చారు. కొంత మందిని తీసేసారు దాని మీద గొడవలు జరిగాయి. కానీ నేను, రాఘవ అన్న మాత్రం అక్కడే ఉన్నాము. నేను నా పని చేసుకుని వస్తాను. చిల్లర పనులు చేయను. నేను చిన్న పిల్లలతో కామెడీ చేయడం మంచిదైంది. నాకు, నా వ్యక్తిగతానికి కూడా అది ప్లస్ అయ్యింది.  నా స్కిట్స్ లో వల్గారిటీ ఉండదు. కోర్ట్లో జబర్దస్త్ మీద చాలా కేసులు ఉన్నాయి. టీమ్ లీడర్స్ లో నా ఒక్కడి మీదే ఇప్పటివరకు ఎలాంటి కేసు లేదు. నేను ఎవరినీ కించపరచను, ఎదుటి వాళ్ళ మీద జోక్స్ వేయను. నా మీద నేనే జోక్స్ వేసుకుని కామెడీ చేస్తాను కానీ ఒకరిని బాధ పెట్టి కామెడీ చేయడం సరికాదు. పక్కవాడిని కామెడీ చేసేది వెకిలితనం వాళ్ళు బాధపడుతుంటే మనం నవ్వుకోవడం కామెడీ ఎలా అవుతుంది. మనతో పాటు మిగతావాళ్లు కూడా ఎంజాయ్ చేసేది అసలైన కామెడీ అది జంధ్యాల గారిది. 

చార్లీ చాప్లిన్, బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు చేసిన కామెడీ చూస్తే వాళ్ళు వేరే వాళ్ళ మీద జోక్స్ వేయలేదు తమ మీద తామే కామెడీ చేసుకున్నారు. అది కామెడీ ఫార్ములా... వెళ్లిపోయిన వాళ్లంతా మళ్ళీ జబర్దస్త్ తిరిగివస్తున్నారు...అందరం కలిసి ఆడియన్స్ కి మళ్ళీ కనిపిస్తాం త్వరలోనే"..అని చెప్పుకొచ్చాడు రాకింగ్ రాకేష్.