Read more!

English | Telugu

నేను పాత రిషిని కాలేకపోతున్నాను.. మన కథ కొత్తగా మొదలైంది కానీ!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.  ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్‌ లో... "కొత్తగా మనం పరిచయమవుదాం.. మన కథ కొత్తగా మార్చుకుందాం.. మళ్ళీ పాత రిషి వసుధారలుగా ఉందాం" అని ఒక ఒప్పందానికి వచ్చిన రిషి వసుధారలు వాళ్ళు అనుకున్నట్టుగానే చేస్తుంటారు.

వసుధార కాలేజీ తర్వాత ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా చేస్తుంటుంది. అది తెలుసుకొని ఆ రెస్టారెంట్ కి ఒక రెగ్యులర్ కస్టమర్ లాగా రిషి వెళ్తాడు. రిషి వెళ్ళగానే కాఫీ తీసుకొస్తుంది. అది తాగేసాక టిప్ ఇస్తాడు రిషి. నా దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తావా.. ఇక్కడ చేస్తే నీకొచ్చే దానికంటే రెట్టింపు డబ్బులు ఇస్తానని రిషి చెప్పగా.. సరేనని వసుధార అంటుంది. ఆ తర్వాత రెస్టారెంట్ బయట‌ కొంచెం దూరంలో వసుధార కోసం ఎదురుచూస్తుంటాడు రిషి. వసుధార రెస్టారెంట్ నుండి బయటకొచ్చి రోడ్ మీద నడుస్తూ వస్తుండగా.. తనని చూసిన కొందరు దుండగులు తప్పుగా ప్రవర్తిస్తుంటారు. రిషి అక్కడికి వెళ్ళి ఆ దుండగులని కొట్టి వసుధారని కాపాడి తన కార్ లో ఇంటికి తీసుకొస్తాడు.

ఇంటికొచ్చాక రిషి వసుధార మాట్లాడుకుంటారు. అప్పుడే కిటికీలో నుండి రిషి మాట్లాడే మాటలన్నీ జగతి వింటుంది. "మనం మన కథని కొత్తగా ప్రారంభించలేం.. మనం కొత్తగా ప్రేమించుకోలేం.‌ నేను పాత రిషిలా నాలోకి నేను ప్రవేశించలేకపోతున్నాను.. జగతి మేడం మీద మొదట కోపం ఉండేది. ఇప్పుడు గౌరవం ఏర్పడింది. కొత్తగా కోపం తెచ్చుకుందామనుకున్నా రావట్లేదు. మనం టైం ట్రావెల్ చేయలేం. గతంలోని అలజడులు.. అయిన గాయాలు.. ఆ భారాన్ని నేను మోయలేను.. ఈ టైం ట్రావెల్ మన సమస్యకి పరిష్కారం కాదు. కొత్త సమస్య అవుతుంది.‌ కాబట్టి ఈ టాపిక్ ని వదిలేద్దాం" అని రిషి అంటాడు. మరి మన మధ్య దూరం ఎలా తగ్గుతుందని వసుధార అడుగుతుంది. మనం ఎంత వెతికినా కొన్ని సమస్యలకు కాలమే సమధానం చెప్పాలని వసుధారతో రిషి చెప్పేసి వెళ్తుండగా.. తన చేయి పట్టుకొని మన ప్రేమ అని అడగగా.. ఈ రిషేంద్ర భూషణ్ ఇచ్చింది తిరిగి తీసుకోడు..‌ఇదే రిషేంద్ర భూషణ్.. నీ వల్ల మారాను వసుధార.. నువ్వు నేను వేరు వేరుగా ఉండటమేమి బాగోలేదు.. అందుకే రిషీధారలు ఒక్కటయ్యేవరకు ఎదురుచూద్దామని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. ఇదంతా కిటికీలోంచి చూసిన జగతి... ఇదా ఇన్ని రోజులుగా వీరి మధ్య జరిగేదని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.