Read more!

English | Telugu

డిస్టర్బ్ అయిన జగతి.. ఈ వసుధార అన్నీ సగం పనులే చేస్తుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 725 లో... జగతికి‌ అసలు‌ నిజం తెలుస్తుంది. దాంతో తీవ్రంగా ఆలోచిస్తుంటుంది. అప్పుడు ఫంక్షన్ నుండి వచ్చిన మహేంద్ర జగతిని చూసి.. ఏంటి డిస్టర్బ్ గా ఉన్నావని అడుగుతాడు. మనకి తెలియకుండా ఏదో జరుగుతుందంటే నమ్మలేదు కదా.. మనముందు అలానే ఉన్నారు.. కానీ మనకి తెలియకుండా వాళ్ళ రిలేషన్ మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేద్దామనుకున్నారని మహేంద్రతో జరిగిందంతా చెప్తుంది జగతి. వాళ్ళ మధ్య ఉన్న దూరం అలానే ఉంది. పాపం పిల్లలు మహేంద్ర‌‌.. మానసిక ఒత్తిడికి గురవుతయన్నారు. ఇలా అయితే ఏం కాదు.. వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలని జగతి అనగా... వాళ్ళు చెప్తే వింటారా అంటే.‌. రిషి నాకు చాలా చేసాడు. అక్క దేవాయనికి ఎదురించి నన్ను ఇక్కడ ఉండేలా చేసాడు. వాళ్ళిద్దరరి మధ్య ఉన్న చిక్కుముడి విప్పి.. వాళ్ళ సంతోషం కోసం ఏదైనా చేద్దాం మహేంద్ర అని జగతి చెప్తుంది. సరే చేద్దామని మహేంద్ర అంటాడు.

రిషి తన గదిలో అద్దంలో చూసుకుంటూ వసుధారకి తనకి మధ్యగల ప్రేమే బంధమని నమ్మాలా అని ఆలోచిస్తూ ఉంటాడు.  ఆ తర్వాత బెడ్ మీద ఒక పేపర్ మీద నెమలీక పెట్టి.. ఈ రోజు భోజనంలో తీపి, చేదు, కారంతో పాటు ఆనందం కుడా కావాలని వసుధార ఒక పేపర్ మీద రాస్తుంది. అది చదివిన రిషి వాళ్ళ ఇంటి టెర్రస్ మీద కూర్చొని తినేలా ఏర్పాటు చేస్తాడు రిషి. తనేం చేసినా నా ఆనందం కోసమే అని అనుకుంటాడు రిషి. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మా పాత రోజులు గుర్తుచేసావమ్మ వసుధార థాంక్స్ అమ్మ అని ఫణీంద్ర భూషన్ అంటాడు. అనవసరమైన కాలయాపణ కాకపోతే ఏంటిది.. ఇవన్నీ మధ్యతరగతి వాళ్ళు ఆలోచిస్తారని దేవయాని అనగా.. కలిసి మాట్లాడుకొని ఆనందంగా తినకపోతే కోట్ల ఆస్తులు ఉండి కూడా అనవసరమని జగతి చెప్తుంది. ఆ తర్వాత అందరూ తినేస్తారు. 

ఆ తర్వాత ఉదయం రిషి, వసుధార, ఫణీంద్ర భూషన్ అందరూ కలిసి ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ జయచంద్ర గారి ఇంటర్వ్యూ చూస్తారు. ఆదర్శ భవితకు ఉత్తమ విలువలకు శ్రీకారం చుడదామని చెప్తాడు. మంత్రి గారు జయచంద్ర గారి ఉపన్యాసాలు మన కాలేజీలో పెట్టమని చెప్పాడు.  కాలేజీకి వెళ్ళిన వసుధార మహేంద్ర రూంకి వెళ్లి అక్కడ ఒక గిఫ్ట్ మీద MD అని రాసి ఉంటుంది. అది చూసి దాని వెనుకాలా MH అని రాద్దామని రాసేలోపే రిషి రావడాన్ని గమనించి వచ్చేస్తుంది వసుధార. వసుధార వెళ్ళిపోయాక ఆ గిఫ్ట్ చూసి.. ఈ పొగరు(వసుధార) అన్నీ సగం పనులు చేస్తుందని అనుకొని..M తర్వాత H రాస్తాడు..MH అని రాస్తాడు. వెంటనే వసుధార వచ్చి.. థాంక్స్ సర్.. నేను ఏది వదిలిపెట్టిన మీరు పూర్తి చేస్తారు. మీరు జెంటిల్ మెన్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అందరూ కలిసి కాలేజీలో జయచంద్ర గారి ఉపన్యాసం కోసం ఫ్లిక్స్ లు కడుతూ ఏర్పాట్లు చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.