Read more!

English | Telugu

వసుధారని పెళ్ళి చేసుకుంటానని చెప్పిన రిషి.. షాక్ లో దేవయాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -732 లో.. వసుధార మెడలోని తాళిని దేవాయని తీసుకొని రిషి గదిలో పెట్టి వస్తుంది. వసుధారనే తాళి తీసి అక్కడ పెట్టిందని అపార్థం చేసుకున్న రిషి.. తర్వాత వసుదార తప్పేం లేదని సారీ చెప్తాడు. రిషి ఇప్పుడైనా ఆ తాళిని వసుధార మెడలో వెయ్యమని మహేంద్ర అంటాడు. లేదు డాడ్.. మాకు కొంచెం టైం కావాలి అంటాడు రిషి. ఆ తర్వాత జగతి, మహేంద్రలు మాట్లాడుకుంటూ.. ఇదంతా వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచడానికే దేవయానే చేసిందని మహేంద్రతో అంటుంది జగతి.

మరోవైపు గదిలోకి వెళ్ళి రిషి వసుధారలు మాట్లాడుకుంటారు. కాసేపటికి వసుధారకి సారీ చెప్తాడు రిషి. మన మధ్యలో ఉన్న అపోహలు తొలిగిపోవాలంటూ.. వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడుకుంటారు. మన ప్రేమ గుర్తుగా ఉన్న రింగ్ ఎక్కడ పడిపోయిందోనని రిషి అంటాడు. నా రూమ్ లోనే పడిపోయి ఉంటుందని వసుధార అనగానే.. పదా వెళ్లి వెతుకుదామంటూ వసుధార రూమ్ లోకి వెళ్ళి వెతుకుతారు. ఒకవైపు మూలన పడి ఉన్న రింగ్ ని చూసి ఇద్దరు ఒకేసారి రింగ్ ని చేతిలోకి తీస్తారు. ఆ రింగ్ ని నా వేలుకి మీరే పెట్టండని వసుధార అంటుంది. అప్పుడు వసుధార చేయి పట్టుకొని.. రిషి తన గదిలోకి తీసుకెళ్తాడు. తమ ప్రేమకి గుర్తుగా ఉన్న గిఫ్ట్ ని తీసుకొని తన దగ్గర ఉన్న తాళిని వేస్తాడు. అప్పుడు వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక రిషి కాన్ఫిడెంట్ గా వసు చేయి పట్టుకొని హాల్లోకి తీసుకెళ్తాడు. హాల్లోకి వెళ్ళిన రిషి ఇంట్లో ఉన్న అందరిని పిలుస్తాడు. అందరూ వచ్చాక‌‌.. ఏమైంది రిషి అని జగతి, మహేంద్రలు కంగారుపడుతారు. సర్ ని చూస్తుంటే ఏదో నిర్ణయం తీసుకున్నట్లే ఉన్నారని వసుధార తన మనసులో అనుకుంటుంది.

ఆ తర్వాత రిషి మాట్లాడుతుంటాడు. నేను వసుధారని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని రిషి అనగానే.. అందరూ సంతోషిస్తారు. దేవాయని మాత్రం.. రిషి ఏంటి ఇలా అంటున్నాడని తన మనసులో అనుకుంటుంది. పెద్దమ్మ పంతులు గారిని పిలిపించి ముహూర్తం చూడమని చెప్పండని రిషి అనగానే.. ఇది శూన్య మాసం కదా రిషి.. ఆ తర్వాత పిలిపించి అడుగుతానని దేవయాని అంటుంది. సరే పెద్దమ్మ అని రిషి అంటాడు. వసుధార పదా అలా మనమిద్దరం బయటికి వెళ్ళివద్దామని రిషి అనగా.. ఎక్కడికని మహేంద్ర అడుగుతాడు. ఆ తర్వాత రిషి వసుధారలు బయటకు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.