Read more!

English | Telugu

జయచంద్ర సూపర్ స్పీచ్.. ఒకరికొకరు గెలిపించుకున్నారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -730 లో పెళ్లి గురించి రిషి, వసుధారలు మాట్లాడిన దానిపై జయచంద్ర  స్టూడెంట్స్ తో పాటుగా ఫాకల్టీకి పోల్ పెడతాడు. వసుధార, రిషిలకి కూడా మీలో ఎవరిది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ పేరులోని మొదటి అక్షరాన్ని పేపర్ మీద రాయమని జయచంద్ర చెప్తాడు. అందరు తమ ఒపినియన్ ని పేపర్ పై రాసి బౌల్ లో వేస్తారు. "రిషి సర్ కరెక్ట్. నేను నా వైపు నుండే అలోచించి.. ఇన్ని రోజులు బాధ పెట్టాను" అని వసుధార అనుకొని రిషి పేరు రాస్తుంది. అలాగే రిషి కూడా "వసుధార అలా చెయ్యలేకపోతే నాకు దక్కేదే కాదు కదా.. తను చేసిందే కరెక్ట్" అని రిషి అనుకొని వసుధార పేరుని రాస్తాడు. ఇద్దరు బౌల్ లో వేస్తుండగా.. మీరు ఇద్దరు ఆ పేపర్లు నాకు ఇవ్వమని జయచంద్ర తీసుకుంటాడు.

ఆ తర్వాత బౌల్ లో వేసిన పేపర్స్  అన్ని కౌంట్ చెయ్యగా ఇద్దరికి సమానంగా వస్తాయి. ఇంకా లెక్కించాలిసినవి ఉన్నాయని రిషి, వసుధారల పేపర్స్ తీస్తాడు జయచంద్ర. మొదటగా వసుధార రాసిన పేపర్ లో 'R' అక్షరం ఉందని చెప్పగా.. ఆ తర్వాత రిషి రాసిన పేపర్ ఓపెన్ చేసి చూసి 'V' అనే అక్షరం ఉందని జయచంద్ర అంటాడు. ఆ తర్వాత రిషి, వసుధారలు ఒకరికొకరు సమర్ధించుకోవడంపై జయచంద్ర మాట్లాడుతాడు. మీరు జీవితంలో ఎదుటి వారి స్థానంలో నిలబడి ఆలోచిస్తే ఇద్దరు సమానమే అని తెలుస్తుందని జయచంద్ర చెప్తాడు. పట్టరాని సంతోషంతో జగతి, పక్కనే ఉన్న మహేంద్రతో.. చూసావా మహేంద్ర ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో ఇన్ని రోజులు ఒకరి మీద ఒకరు గెలవాలనుకున్నారు. ఇప్పుడు ఒకరినొకరు గెలిపించుకున్నారని జగతి అంటుంది. మహేంద్ర సంతోషంతో అవునని అంటాడు. ఆ తర్వాత ఇక స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతారు.

ఆ తర్వాత వసు, రిషిలు ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటా హగ్ చేసుకుంటారు. వెనకాల వైపు నుండి జయచంద్ర చప్పట్లు కొడతాడు‌. అప్పుడు ఇద్దరు దూరంగా జరుగుతారు. ఈ ప్రపంచం మొత్తం అడ్డొచ్చినా మిమ్మల్ని విడదీయలేరు. మీ ప్రేమని నిలబెట్టుకునే బాధ్యత మీదే అని జయచంద్ర అంటాడు. అది రిషి సార్ చేతుల్లోనే ఉంది. మీరు మనది వివాహ బంధమని భావిస్తే ఈ తాళి నా మెడలో ఉంటుంది అని వసు అంటుంది. రిషికి కొంచెం టైం ఇవ్వండని జయచంద్ర అంటాడు. ఆలోచించుకోని మేమంతా సంతోషపడే విషయం చెప్పు అని మహేంద్ర అంటాడు. ఇక అందరూ కలిసి జయచంద్ర కు సెండాఫ్ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.