Read more!

English | Telugu

కాలేజీకి వెళ్ళడానికి ఒప్పుకున్న రిషి.. హ్యాపీగా ఉన్న వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసరమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -786 లో.. రిషి నువ్వు కాలేజీకి వెళ్లకుండా కేడి బ్యాచ్ సంగతి చూడలేవు.. నువ్వు ప్రతీరోజు కాలేజీకి వెళ్లాలని విశ్వనాథ్ అనగానే.. జగతి అన్న మాటలు గుర్తుచేసుకుంటూ నేను వెళ్ళనని  రిషి అంటాడు. ఏం చెప్పినా చేసేవాడివి ఇప్పుడేంటి బ్రతిమాలినా కూడా చెయ్యట్లేదని విశ్వనాథ్ అంటాడు. ఏంజెల్, విశ్వనాథ్ చేసిన సహాయాన్ని గుర్తుచేసుకుంటూ రిషి కాలేజీకి వెళ్తానని చెప్తాడు. విశ్వనాథ్, ఏంజెల్ లు సంతోషపడతారు.

మరొక వైపు మహేంద్ర ఫ్రెండ్ ఒకతను మహేంద్ర ఇంటికి వస్తాడు. అందరు హాల్లో కూర్చొని ఉంటారు. నా పలుకుబడి మొత్తం ఉపయోగించి రిషి కోసం చాలా వెతికించాను కానీ రిషి ఎక్కడున్నాడో ఇప్పటి వరకు తెలియలేదు. నీకు రిషి అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు మహేంద్ర.. చాలా చోట్ల వెతికించానని మహేంద్ర ఫ్రెండ్ అంటాడు. నేను కూడా చాలా వెతికిస్తున్నాను.. ఎక్కడ కన్పించడం లేదని శైలేంద్ర అంటాడు. ఇంత మంది వెతుకుతున్న రిషి ఎక్కడున్నాడో తెలియట్లేదని శైలేంద్ర అనగానే.. రిషి కావాలనే వెళ్ళిపోయాడు. మనకు దూరంగా ఉండాలని వెళ్ళాడు కాబట్టి ఎందుకు తెలుస్తుందని దేవయాని అంటుంది. "అమ్మ జగతి నిన్ను ఒక విషయం అడుగుతాను చెప్తావా" అంటూ మహేంద్ర అంటాడు. అసలు రిషి ని కాలేజీ నుండి పంపించడానికి గల కారణమేంటని మహేంద్ర ఫ్రెండ్ అడుగుతాడు.. జగతి ఇబ్బంది పడుతు అన్నయ్య నేను ఇప్పుడు చెప్పలేను, రిషి వచ్చాకే అన్నింటికి సమాధానం దొరుకుతుందని జగతి అంటుంది. చూడు ఇది తన వైఖరి అని జగతిని ఉద్దేశించి మహేంద్ర అంటాడు.

ఆ తర్వాత వసుధార కాలేజీ నుండి ఇంటికి వెళ్తుంది. వసుధార హ్యాపీగా ఉంటుంది. అలా ఉండడం చూసిన వాళ్ళ నాన్న చక్రపాణి.. ఏంటి కాలేజీ నుండి నీరసంగా వస్తావ్ అనుకుంటే హ్యాపీగా ఉన్నావ్ అని చక్రపాణి అడుగుతాడు. ఏం లేదు నాన్న కాలేజీకి ఒకతను వచ్చి మురుగన్ కి వార్నింగ్ ఇచ్చాడట.. ఇక కేడి బ్యాచ్ గొడవ ఉండదని వసుధార అంటుంది. మరొకవైపు శైలేంద్ర, దేవయాని లు జగతి దగ్గరికి కొన్ని ఫైల్స్ తీసుకొని వచ్చి.. చూడు DBST కాలేజీ డౌన్ అవుతుంది. అడ్మిషన్స్ తగ్గాయి.. ఇలా అయితే మన కాలేజీ ఏమవుతుందని శైలేంద్ర అంటాడు. DBST కాలేజీ ఎప్పటికి డౌన్ కాదు అలా రిషి కాలేజీని తీర్చిదిద్దాడని జగతి అంటుంది. అప్పుడే ఫణింద్ర వచ్చి.. కొన్ని రోజులు నువ్వు ప్రశాంతంగా ఉండు.. ఎండీ బాధ్యతలకు దూరంగా ఉంటే మంచిదని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు  ఆగాల్సిందే.