Read more!

English | Telugu

రాజ్ కంటపడకుండా కావ్య తప్పించుకుంటుందా?


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -30 లో.. రాజ్ తలపాగా కావ్య దగ్గరే ఉండిపోవడంతో తను ఎలాగైనా రాజ్ ఇంటికి చేర్చాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి అన్ని సామాన్లు ఉన్నాయో లేవోనని రాజ్ వాళ్ళ అమ్మ చూస్తుంటుంది. తీసుకొచ్చిన వస్తువులలో తలపాగా లేదని కళ్యాణ్ తో రాజ్ వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు కళ్యాణ్, కావ్యకి ఫోన్ చేసి తలపాగా తీసుకురమ్మంటాడు. అలా చెప్పడంతో కావ్యనే స్వయంగా తలపాగా తీసుకొని రాజ్ ఇంటికి వస్తుంది.

మరోవైపు రాహుల్ ఆలోచనల్లో స్వప్న పిచ్చిదవుతుంది. స్వప్న ఫోన్ చేస్తే రాహుల్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. స్వప్న కాల్ చేసిన ప్రతీసారీ నిన్ను ఎంత దూరం పెడితే అంత దగ్గర అవుతావని రాహుల్ తన మనసులో అనుకుంటాడు. "ఏంటి రాహుల్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు.. నేను అంటే ఇష్టం అన్నాడు.. ఖరీదైన బహుమతులిచ్చాడు.. లేచిపోదామన్నాడు.. కొంపదీసి మనసు మార్చుకున్నాడా.. అదేం అయి ఉండదులే తన చుట్టూ అందరూ ఉండి ఉంటారు.. అందుకే ఇలా చేస్తున్నాడు" అని మళ్ళీ తనకు తానే సర్దిచెప్పుకుంటుంది స్వప్న.

ఆ తర్వాత కనకం దగ్గరికి వెళ్తుంది స్వప్న. "అమ్మ నీకొకటి చెప్పాలి.. నీకు రాహుల్ తెలుసు కదా.. తను చాలా రిచ్" అంటూ రాహుల్ గురించి గొప్పగా చెప్తుంది స్వప్న.. అలా చెప్పేసరికి కావ్యకి సంబంధం సెట్ చేస్తుందని కనకం అనుకుని.. "నువ్వు ఎంత మంచిదానివే.. నీ చెల్లి గురించి ఆలోచిస్తున్నావ్" అంటుంది. అలా కనకం అనేసరికి.. "అయ్యో అమ్మకి ఇలా అర్థం అయిందా" అని స్వప్న అనుకుంటుంది. మరోవైపు తలపాగా తీసుకొని కావ్య, రాజ్ ఇంటికి వెళ్లి సెక్యూరిటీతో తలపాగ ఇచ్చి రాజ్ కి ఇవ్వమని చెప్తుంది. ఆ తర్వాత స్వప్నని పెళ్ళికూతురు చేయడానికి కావలసిన వస్తువులు, నగలు తీసుకొని రాహుల్ వస్తాడు. స్వప్న, రాహుల్ పై కోపంగా ఉంటుంది. అలా రాహుల్ ని చూసి ఎలాగైనా తనతో మాట్లాడాలని కళ్ళు తిరిగి పడిపోయినట్లు నటిస్తుంది. ఆ తర్వాత స్వప్నని రాహుల్ ఎత్తుకొని తీసుకుపోయి బెడ్ మీద పడుకోపెడతాడు.

మరో వైపు కావ్య, రాజ్ కి డాష్ ఇస్తుంది. రాజ్ తనని చూడకుండా.. తన కంటపడకుండా తప్పించుకుంటుంది కావ్య. అప్పటికే రాజ్ కి కావ్య వచ్చినట్లుగా అనుమానం వస్తుంది. మరోవైపు కనకంని ఎలాగైనా బయటికి పంపించి, రాహుల్ తో మాట్లాడాలని స్వప్న అనుకుంటుంది. కనకంని జ్యూస్ తెమ్మని చెప్పి అలా బయటకు పంపిస్తుంది స్వప్న. ఆ తర్వాత గదిలో స్వప్న, రాహుల్ ఇద్దరే ఉంటారు. "నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు" అని స్వప్న అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.