Read more!

English | Telugu

అసలు నిజం తెలుసుకున్న రాహుల్.. అద్దాల మేడలో కావ్యకు గది లేదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌లో.. రాజ్ ని పెళ్ళి చేసుకొని ఇంట్లోకి వచ్చిన‌ కావ్యని  వాళ్ళ అత్తమ్మ అపర్ణ .. తన కన్నవాళ్ళతో మాట్లాడకుండా ఉండాలని మాట ఇవ్వమంటుంది. దానికి కావ్య .. "ఈ ప్రపంచంలో ఎన్నో  మార్పులను సృష్టిస్తున్నాయి ఈ ఋతువులు.. మనుషులు మీరు.. మిమ్మల్ని మార్చలేవా.. మీరు మారుతారనే నమ్మకంతో మాట ఇస్తున్నాను" అని కావ్య ఒప్పుకుంటుంది.

ఆ తర్వాత రాజ్ వాళ్ళ నానమ్మ .. పెళ్ళికూతురిని అలా నిలబెట్టి మాట్లాడుతున్నారు ఎవరైనా ‌తనని గదిలోకి తీసుకెళ్ళండని చెప్పగా.. అందరూ ఏ రూంలోనూ ఖాళీ లేదని చెప్తారు. దీంతో రాజ్ నా రూం‌లో ఉంటుందని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. నేను నీ గదిలో ఉంటే నీకు ఇష్టమేనా అని రాజ్ తో కావ్య అడుగగా.. నువ్వంటే ఎప్పటికీ ఇష్టముండదని చెప్తాడు. దాంతో నీకు ఇష్టం లేకుండా.. నువ్వు నన్ను భార్యగా ఒప్పుకునేవరకూ నీ గదిలో‌ అడుగుపెట్టను అని కావ్య చెప్తుంది. నీ జాలి నాకేం అవసరం లేదు. నువ్వు నాకు పొగరు అంటున్నావ్ కదా.. అది నా ఆత్మాభిమానం. ఆ తర్వాత అందరూ ఎక్కడవాళ్ళు అక్కడ వెళ్తారు. ఇంటిపనిమనిషి వచ్చి కావ్యని కిచెన్ లోకి తీసుకెళ్తుంది. ఇంతపెద్ద ఇంట్లో ఒక్క గది కూడా ఖాళీ లేదా.. అది ఏ రూం అని అడుగగా.. అది స్టోర్ రూం అమ్మా.. మీరు ఉండలేరని పనిమనిషి అంటుంది. గది అయితే చాలు సర్దుకుంటానని కావ్య చెప్తుంది.

మరోవైపు రాహుల్, స్వప్న లు సంతోషంగా ఉంటారు. "మన పెళ్ళి విషయం ఏం చేశావ్ ? ఇప్పటికే మా అమ్మ నా గురించి ఏడుస్తుంది కావొచ్చు. మనం తొందరగా పెళ్ళి చేసుకొని వెళ్దాం. నేను తెలివైనవాడిని. గొప్పవాడిని చేసుకున్నాని నిన్ను మా అమ్మకి చూపిస్తాను" అని స్వప్న చెప్తుంది. అది విని రాహుల్ మనం గ్రాండ్ గా పెళ్ళి చేసుకుందామని, కాస్త టైం పడుతుందని చెప్తాడు. ఆ తర్వాత రాహుల్ వాళ్ళ అమ్మ రుద్రాణి కాల్ చేస్తుంది. ఎక్కడున్నావ్ రాహుల్? రాజ్ పెళ్ళి ఆగిపోయింది తెలుసా? అని అడుగగా.. హా తెలుసు అమ్మా అని అంటాడు. "అన్నీ సగం సగం వినకు.. పూర్తిగా తెలుసుకో.. స్వప్నకి ఒక చెల్లెలు ఉంది. ఆ రోజు వినాయకుడికి రంగులు వేసింది కదా.. ఆ పూర్ గర్ల్.. ఆమెనంట. రాజ్ కి ఆ అమ్మాయితో పెళ్ళి అయింది. స్వప్న రిచ్ కాదు. మనం పెళ్ళిచూపులకి వెళ్ళిన ఇల్లు కూడా వాళ్ళది కాదంట. ఈ విషయాలన్నీ ముందే నాకు తెలుసు కానీ నేననుకున్నది నెరవేరాలని చెప్పలేదు" అని రుద్రాణి అంటుంది.

"నాకైనా చెప్పుండాల్సింది కదా అమ్మా" అని రాహుల్ అంటాడు. చెప్తే ఏం చేసేవాడివి.. దుగ్గిరాల ఫ్యామిలీ పరువు పోయిందని రుద్రాణి సంతోషపడుతుంది. ఇదంతా విన్న రాహుల్ "అయ్యో నేను చేసుకున్నది ఒక పూర్ గర్లా.." అని భాద, కోపం రెండూ ఒకేసారి వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.