Read more!

English | Telugu

వాస్తు బాగుందని చెప్పి ఈ ఇల్లు ఇప్పించింది బ్రహ్మానందం గారే...

రచ్చ రవి బుల్లితెర కమెడియన్ గా నెమ్మదిగా ఎదుగుతూ ఒదుగుతూ అలా అలా సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా రచ్చ రవి చేసిన మూవీస్ లో ఆయన క్యారక్టర్ కూడా బాగా హైలైట్ అవుతూ మంచి పేరునే సంపాదిస్తున్నాడు. ‘వన్స్‌మోర్‌ ప్లీజ్‌’ అనే వేదికపై తానేంటో నిరూపించుకుని ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు.  అలాంటి రచ్చ రవి తన అందమైన ఇంటిని అందులో తాను సంపాదించుకున్న అవార్డ్స్ ని కూడా చూపించాడు. తన ఇంట్లో ఒక షో కేసుగా కనిపించడానికి ఒక చెట్టును పళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు. కష్టపడితే ప్రతిఫలం వస్తుంది అనే విషయాన్ని  లైవ్ గా తన పిల్లలకు చూపించాలంటే ఇదొక్కటే మార్గం అని దాన్ని ఏర్పాటు చేయించుకున్నాడట. ఆ చెట్టు కిందే కూర్చుని భోజనాలు చేస్తారని చెప్పుకొచ్చాడు. 

"చెట్టు పిట్టకు గూడు కట్టుకోమని చెప్తుంది మనకు నీడనిస్తుంది. కానీ మనం ఎం చేస్తున్నాం పళ్ళను తినాల్సింది పిట్టను తిని చెట్టుని కొట్టి పొల్యూషన్ ని పెంచేస్తున్నాం" అంటూ చెట్టు గురించి చాలా అద్భుతంగా చెప్పుకొచ్చాడు. తన ఇంట్లో బ్రహ్మానందం ఫోటో పెట్టుకున్నాడు రచ్చ రవి. ఎందుకు అంటే ఈ ఇల్లు వాస్తు చూసి బాగుంది అని ఇప్పించింది ఆయనే అని చెప్పాడు. కళ్యాణవైభోగం, రాజా ది గ్రేట్‌, శతమానం భవతి, నేనే రాజు నేనే మంత్రి, మ్యాస్ట్రో, ఎంసీఏ, ఎఫ్‌2, గద్దలకొండ గణేశ్‌, సరిలేరు నీకెవ్వరు, క్రాక్‌, బట్టర్ ఫ్లై, బలగం మూవీస్ లో డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉన్న  పాత్రలు వచ్చాయన్నారు.  ఎదుటి వారి మీద ఎలాంటి వ్యంగ్యం లేకుండా 30 వేల మందిని నవ్వించినందుకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సంపాదించాడు రవి. రచ్చ రవి జబర్దస్త్‌ ఆర్టిస్టుగా, స్టాండప్‌ కమెడియన్‌గా, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా, స్కిట్స్‌ రైటర్‌గా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ‘రచ్చ రవి’ అనే యాప్‌తో ఎంతో మందికి సామాజిక సేవ కూడా చేస్తున్నట్లు చెప్పాడు.  చార్లీ చాప్లిన్‌ , జంధ్యాల కామెడీ అంటే ఇష్టమన్నాడు    రచ్చ రవి.