Read more!

English | Telugu

ప్రదీప్ నువ్వు కూడా హీరోనే!

సర్కార్ సీజన్ 3  నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ రాబోయే ఎపిసోడ్ కి "అన్ని మంచి శకునములే" మూవీ టీమ్ ప్రమోషన్స్ లో భాగంగా నందిని రెడ్డి, మాళవికా నాయర్, సంతోష్ శోభన్ వచ్చారు..మాళవిక ఏమీ మాట్లాడకపోయేసరికి "డైరెక్టర్ గారు ఒక్కసారి హీరోయిన్ కి యాక్షన్ చెప్పరా లేదంటే మాట్లాడరేమో" అని ప్రదీప్ అనేసరికి "నాతో మీరు మాట్లాడట్లేదుగా" అని  మాళవిక అనడంతో నవ్వుకుంటూ వచ్చి ఆమె  పక్కన నిలబడ్డాడు. "ప్రదీప్ నువ్వు హీరో కూడా" అని చెప్పింది నందిని రెడ్డి. "గురువుగారు ఇక్కడ ఉన్నవాళ్ళంతా నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఎవరు ఎదురొస్తే మంచిది" అని సంతోష్ ని అడిగేసరికి "ఎవరూ ఎదురు రావక్కర్లేదు..పుస్తకం ఎదురుగా ఉంటే చాలు" అనేసరికి అందరూ నవ్వేశారు.

"సరే సంతోష్ గారు మీకు మీరు ఇష్టంగా చేసుకునే ఐటెం ఏమిటి" అని అడిగేసరికి "హాట్ వాటర్" అని ఆన్సర్ ఇచ్చాడు. తర్వాత మాళవిక నాయర్ తో స్పెషల్ గా గేమ్స్ ఆడించేసరికి "నాకెందుకో ప్రదీప్ ఇదంతా నీకు లైన్ వేయడానికి చేస్తున్నాడని నా ఫీలింగ్" అంది నందిని రెడ్డి. తర్వాత మాళవిక ప్రదీప్ కి కాలీఫ్లవర్ పువ్వు ఇచ్చేసరికి ప్రదీప్ చాలా హ్యాపీగా తీసుకుని గుండెకద్దుకున్నాడు. "ఈరోజు నుంచి కాలీఫ్లవర్ ని నేను పువ్వుల డిపార్ట్మెంట్ లో వేసేస్తున్నాను" అని చెప్పాడు. ఇలా ఈ షోలో మంచి కామెడీగా ఉంది ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది. ఇక ఈ షో ఆహా ఓటిటి వేదిక మీద 19 న స్ట్రీమ్ కాబోతోంది.