English | Telugu

Podarillu: పెళ్ళి ఆగిపోతుందని మహాలక్ష్మికి నమ్మకాన్ని ఇచ్చిన చక్రి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు (Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-13లో.. మహా వాళ్లింట్లో చక్రి కారు తుడుస్తుంటాడు. అప్పుడే మహా వాళ్ళ అన్నయ్య వచ్చి.. యాదగిరిగుట్టకి వెళ్తున్నాం.. లోపల లగేజీ ఉంది తీసుకురమ్మని చెప్పగా అతను డిజప్పాయింట్ అవుతాడు. ఇక చక్రి లగేజీ తెస్తుంటే మహా వాళ్ళ నాన్న.. అతడిని ఆపి..‌ మా ఇంటికి డ్రైవర్ గా వస్తావా అని అడుగుతాడు. వస్తానని చక్రి చెప్తాడు.

మహా వాళ్ళ ఫ్యామిలీ అంతా కార్ లో వెళ్తుంటారు. దారిలో మహాకి ఇష్టమైన స్వీట్ కొనడానికి స్వీట్ షాప్ దగ్గర ఆపమంటాడు వాళ్ల నాన్న. నాకేం వద్దని మహా అంటుంది. అయినా వినకుండా వాళ్ళంతా కార్ దిగి వెళ్తారు. ‌ఇక అదే సమయంలో చక్రి తనతో మాట్లాడతాడు. మీరేం టెన్షన్ పడకండి నేను పెళ్ళి జరగకుండా చూస్తానని మహాకి చక్రి నమ్మకంగా చెప్తాడు. నీకెందుకు.. మా నాన్నకి తెలిస్తే నిన్ను చంపేస్తాడని చక్రితో మహా అంటుంది. ఆ తర్వాత అందరు వెళ్తారు.

ఇక రాత్రి అందరు భోజనం చేస్తుంటారు. రేయ్ ఆది రిజిస్టర్ మ్యారేజ్ కి ఎవరెవరిని పిలుద్దామని మహా వాళ్ళ నాన్న అడుగుతాడు. తింటున్న మహా వెంటనే కోపంగా లేచి నిల్చుంటుంది. ఏమైందమ్మా కూర నచ్చలేదా అని మహా వాళ్ళ నాన్న అడుగగా.. కూర నచ్చకపోతే పచ్చడి వేసుకొని తినొచ్చు.. కానీ భర్తే నచ్చకపోతే జీవితాంతం భరించాల్సిందేగా అని మహా అంటుంది. నువ్వు అతడిని నెగెటివ్ గా చూడటం మానెయ్యాలి.. అతను బాగా చూసుకుంటాడని మహాని వాళ్ళ‌ నాన్న కన్విన్స్ చేస్తాడు. దాంతో మహా కోపంగా వెళ్ళిపోతుంది.

మరోవైపు చక్రి బయట ఉంటాడు. వీళ్ళు అన్నం పెడతారా.. బయటకు వెళ్ళి తినేసి రావాలా అని చక్రి ఆకలితో అటు ఇటు తిరుగుతుంటాడు. ఇంతలో మహా బాధతో బయటకు వచ్చి కూర్చుంటుంది. ఇక తన దగ్గరకి చక్రి వచ్చి.. నేను బయటకి వెళ్ళి తిని రావాలా.. పెడతారా లేదా అని అడుగుతాడు. తినలేదా అని మహా అడుగుతుంది. లేదని చక్రి అనగానే మహా లోపలికి వెళ్లి అన్నం , చాపల పులుసు, చాపల ఫ్రై తీసుకొని వస్తుంది. ఇక అది తింటూ మహాకి సపోర్ట్ గా మాట్లాడతాడు. నీ రిజిస్టర్ మ్యారేజ్ అవ్వకుండా నేను చూసుకుంటా.. మీరు నా కోసం ఇంత చేశారు.. నేను ఇది చేయలేనా అంటూ మహాకి నమ్మకం కలిగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.