Read more!

English | Telugu

నవ్విస్తూనే ఏడిపించేసిన విరాజిత- ప్రసాద్ బెహరా..ట్రెండింగ్ లో పెళ్ళివారమండి సిరీస్!

 

యూట్యూబ్ లో గత కొన్ని నెలలుగా ఓ వెబ్ సిరీస్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది. ‌అదే ప్రసాద్ బెహరా రాసుకున్న కథ ' పెళ్ళివారమండి'. ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ లోని ప్రతీ ఎపిసోడ్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

ఇక రెండు నెలల ముందు మొదలైన సీజన్-2 కి విశేష స్పందన లభిస్తోంది. ఈ సీరీస్ లోని పాత్రలు చాలా తక్కువే ఉన్నా.. ప్రతీ పాత్ర అందరికి కనెక్ట్ అయ్యేలా ప్రసాద్ బెహారా మాటలు రాసుకున్నాడు. ప్రసాద్ బెహరా, విరాజిత, జెడీవీ ప్రసాద్, శ్వేత ఘట్టమనేని, ఎప్సిబా, చందు ఛార్మ్స్, హర్షిణి బల్ల, శృతి రావు, చందు జేసీ, అక్షయ్ మదన్, శ్రీ కుమారి ముఖ్య పాత్రలుగా సాగుతున్న ఈ ' పెళ్ళి వారమండి' వెబ్ సిరీస్ కి రచన, దర్శకత్వం ప్రసాద్ బెహరా..  ఇప్పటికే  ఈ సిరీస్‌ ఎనిమిది ఎపిసోడ్ లు విడుదలయ్యాయి. ప్రతీ ఎపిసోడ్ మినిమమ్ ఇరవై లక్షల పైచిలుకు వ్యూస్ ని పొందింది. అయితే మరి అంతగా ఏం ఉందంటే.. ఆఫీస్ లో బాస్ లై సెటైర్లు వేయడం, టీమ్ లీడర్లపై అలక, ఫ్రెండ్లీ నేచర్.. సహజసిద్ధమైన శైలీ.. కామెడీతో యూత్ ని అట్రాక్ట్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సిరీస్ లోని పదవ ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అవ్వగా అది పద్దెనిమిది లక్షల వ్యూస్ కి చేరుకుంది. 

ప్రసాద్ , రెడ్డి గారి జాబ్ లని జేసీ తీసేయడంతో వాళ్ళకి ఏం చేయాలో తోచదు.‌ ఇక రెడ్డి గారేమో పక్కింటి ఆంటీలతో హౌజీ ఆడుకుంటాడు. ఇక ప్రసాద్ కాల్ చేస్తే  రెడ్డి రమ్మని చెప్తాడు. ఇక రెడ్డి గారింటికి ఆఫీస్ లోని కొత్త కొలీగ్ పంజాబీ అమ్మాయి వచ్చి.. రెడ్డికి ప్రపోజ్ చేస్తుంది. అది విన్న ప్రసాద్ అతనికి అర్థమయ్యేలా చెప్తాడు. ఇక ఆ సంతోషంలో వాళిద్దరి పార్టీకి ప్లాన్ చేస్తుంటారు. అదే సమయంలో ఈవినింగ్ కలవాలని ప్రసాద్ కి విరాజిత మెసెజ్ చేస్తోంది. ఇక సాయంత్రం వాళ్ళిద్దరి కలుసుకున్నాక.. విరాజిత మాట్లాడే ప్రతీ డైలాగ్ , ప్రతీ మాట చూస్తున్న ప్రేక్షకుడిని ఎమోషనల్ గా మార్చేస్తుంది. మరి మీలో ఎంతమంది ఈ వెబ్ సిరీస్ ని చూశారు. యూట్యూబ్ లో ప్రస్తుతం అత్యధిక వీక్షకాధరణతో ట్రెండింగ్ లో ఉన్న ఈ సిరీస్ ని మీలో ఎంతమంది ఫాలో‌ అవుతున్నారో కామెంట్ చేయండి.