Read more!

English | Telugu

దుబాయ్ ఎడారిలో  పవిత్ర తిప్పలు! 

జబర్దస్త్ పవిత్ర.. ఇప్పుడు అందరికి సుపరిచితమే. జీతెలుగులో వస్తున్న సూపర్ క్వీన్ లో వాళ్ళ అమ్మని తీసుకొచ్చి తన జీవితం ఎలా ఉందో చెప్తూ ఎమోషనల్ అవడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

జబర్దస్త్ పవిత్ర.. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వాళ్ళ అమ్మ చేసిన కష్టాలని దగ్గరనుండి చూసిన పవిత్ర.. తన చదువు ఇంటర్మీడియట్ వరకే ఆపేసిందంట. తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ అంట్లు తోమడానికి వెళ్ళినప్పుడు సాయం చేయడానికి తను కూడా వెళ్ళిందంట. జబర్దస్త్ కామెడీ షోలో ఒకప్పుడు లేడీ కమేడియన్లు ఉండేవాళ్ళు కాదు అబ్బాయిలే అమ్మాయిల వేషం వేసుకొని కామెడీని చేసేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా బాగానే కన్పిస్తున్నారు. భాస్కర్ టీం, హైపర్ ఆది టీం, వెంకీ మంకీస్ టీం, రాకెట్ రాఘవ టీం ఇలా అందరి టీంలలో కామన్ గా ఉంటున్న పవిత్ర.. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటుంది. 

ఇమాన్యుయల్ తో కలిసి మంచి బాండింగ్ ఉన్న పవిత్ర రెగ్యులర్ రా రీల్స్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంటుంది. కాగా ఆ వీడియోలకి విశేష స్పందన లభిస్తుంది. అయితే పాగల్ పవిత్ర పేరుతో తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది. అందులో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ అందరికీ దగ్గరవుతుంది. అయితే తాజాగా తను దుబాయ్ టూర్ కి వెళ్ళింది పవిత్ర ‌ అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఇసుకలో రైడ్ చేస్తూ సరదాగా గడిపారు. అయితే అక్కడే జబర్దస్త్ రాకెట్ రాఘవ కూడా తన ఫ్యామిలీతో కలిసి రావడంతో సూపర్ సర్ ప్రైజ్ గా ఫీల్ అయ్యారు. వాళ్ళు అక్కడ ఎలా గడిపారో అంతా వ్లాగ్ లో వివరించింది పవిత్ర.