Read more!

English | Telugu

ఏ యాంగిల్ లో చూసినా మదర్ లా లేరు.. మరదలులా ఉన్నారు

సిక్స్త్ సెన్స్ సీజన్ 2 ప్రతీ వారం కలర్ ఫుల్ గా వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఈ వారం ఈ షోకి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నుంచి కస్తూరి, బ్రహ్మముడి సీరియల్ నుంచి నీపా, కృష్ణమ్మా కలిపింది ఇద్దరినీ సీరియల్ నుంచి సుష్మకిరణ్, మధురానగరిలో సీరియల్ నుంచి జ్యోతి రెడ్డి వచ్చారు. ఈ వారం  వీళ్ళు ఆడియన్స్ ని  ఎంటర్టైన్ చేయబోతున్నారు. "మీ  నలుగురు... మదర్స్ అన్నారు కానీ మీరు ఇంత హాట్ గా వస్తే నాకు చెమట్లు పడుతున్నాయి" అని కామెంట్ చేశారు ఓంకార్. "ఊ అంటావా మావ" అనే సాంగ్ కి నీపా, కస్తూరి డాన్స్ ఇరగదీసారు..."బావవి నువ్వు భామను నేను" అనే సాంగ్ కి కస్తూరి చేసిన డాన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు.

ఆ డాన్స్ కి ఫిదా ఐన ఓంకార్ "కస్తూరి గారు...కింద ఏదో పడిపోయింది" అనేసరికి "ఏమిటి సర్ అని నేల మీద వెతుకుతుండేసరికి" " మీ అందం పడిపోయింది" అని చెప్పాడు. "ఎలిఫెంట్ ని గనక మీకు గిఫ్ట్ గా ఇస్తే ఎక్కడ దాచి పెట్టుకుంటారు " అని కస్తూరిని అడిగేసరికి "మీ పెద్ద మనసులో దాచి పెట్టుకుంటాం  సర్ " అని చెప్పింది. నీపా బ్రహ్మముడి సీరియల్ లో కనకం పాత్రలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కస్తూరి తులసిగా ఒక అద్భుతమైన మదర్ రోల్ లో నటిస్తూ హోంలీ యాక్టర్ గా పేరుతెచ్చుకుంది. మధురానగరిలో సీరియల్ లో మధుర రోల్ లో మంచి మదర్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంటోంది జ్యోతి రెడ్డి. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సీరియల్ లో సౌదామినిగా విలన్ రోల్ లో నటిస్తోంది సుష్మ కిరణ్. ఇలా ఈ నాలుగు సీరియల్స్ టాప్ లీడింగ్ లో ఉన్న యాక్టర్స్ తో ఈ వారం షో చేశారు ఓంకార్.