Read more!

English | Telugu

మరోసారి నెటిజన్ల ట్రోల్స్ లో చిక్కుకున్న యాంకర్ వర్షిణి!

ఇండియాలో ఐపీఎల్ కి ఉండే క్రేజే వేరు.‌ చిన్న తారల నుండి బడా హీరోల వరకు ఈ మ్యాచ్ లు చూడటానికి టైమ్ కేటాయిస్తారు. హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుందంటే తెలుగు సినిమా హీరో, హీరోయిన్ లు , కామెడీయన్లు, సీరియల్ నటీనటులు, ‌యాంకర్లు ఇలా అందరు తప్పకుండా టికెట్లు బుక్ చేసుకొని వెళ్తారు. ఇప్పుడు యాంకర్ వర్షిణి మ్యాచ్ చూడటానికి ఉప్పల్ వెళ్ళింది‌. అది కాస్తా వైరల్ గా మారింది. 


పటాస్ 2 షో యాంకర్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే…ముద్దు ముద్దు మాటలతో…అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్‌లతోనూ బిజీగా ఉంది. అసలేం జరిగిందంటే గతేడాది జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లకి కూడా వర్షిణి హాజరైంది. అప్పుడు ఉప్పల్ వేదికగానే జరిగిన మ్యాచ్ లో చాలామంది తెలుగు అభిమానులతో పాటు.. సెలబ్రిటీలు కూడా సందడి చేశారు. వారిలో యాంకర్ వర్షిణి కూడా ఉంది. సన్‌రైజర్స్‌‌కు అండగా స్టేడియంలో కేరింతలు కొడుతూ మ్యాచ్‌‌ను తెగ ఎంజాయ్ చేసింది. ఈ మ్యాచ్‌కు హాజరైన ఫొటోలను వర్షిణి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా.. అభిమానులు ఆమెను ట్రోలింగ్ చేశారు. ఎందుకంటే తను ఐరన్ లెగ్ అని , తనజ రాకపోయి ఉంటే మన టీమ్ గెలిచేదేని సన్ రైజర్స్ అభిమానులంతా కలిసి వర్షిణిని తిడుతూ పోస్ట లు చేశారు. దాంతో వర్షిణి కొన్ని రోజులు కాదు కొన్ని నెలలు సోషల్ మీడియాకి దూరంగా ఉంది. ఇక ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతుందేమోనని అనుకుందో ఎమో కానీ మ్యాచ్ అవుతున్నంతసేపు ఒక్క ఫోటో కూడా పెట్టలేదు. నిన్న జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కి హాజరైన వర్షిణి మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఒక్క ఫోటో పెట్టకుండా.. మ్యచ్ ముగిసాక సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచాక తను స్టేడియంలో ఉన్న ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. " అండ్ వి వోన్" అని క్యాప్షన్ కూడా  పెట్టింది.

అయితే ఇప్పుడు మరోలా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. నువ్వు మ్యాచ్ కి వచ్చిన పోస్ట్ చేయలేదంటే గతేడాది జరిగింది బాగానే గుర్తుందని ఒకరు కామెంట్ చేయగా, అంత మెల్లిగా ఒక్కటే లైన్ క్యాప్షన్ రాసావేంటి.. రెండు మూడు ఈమోజీలు కూడా  ఆడ్ చేయపోయావ్ అని మరొకరు.. ఈ రోజు మన కెమెరామెన్ ఫోకస్  మొత్తం నీ మీదే పెట్టాడు. నీ మీద కేస్ పెడతా అని మరొకరు కామెంట్ చేశారు. హైదరాబాద్ కి చార్మ్ అని మరొకరు .. నువ్వు వెళ్ళకమ్మ నీకో దండం.. మ్యాచ్ ఓడిపోతే నీకు కెపిసిడి అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి నెటిజన్ల ట్రోల్స్ తో మరోసారి వర్షిణి వార్తల్లో‌ నిలిచింది.