Read more!

English | Telugu

నెటిజన్ల కామెంట్లతో హాట్ టాపిక్ గా మారిన 'బీబీ జోడి'

స్టార్ మా టీవీలో ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమవుతున్న   డ్యాన్స్ షో 'బిబి జోడి'. సదా, రాధ, తరుణ్ మాస్టర్ జడ్డులుగా శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న ఈ డ్యాన్స్ షో.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విడుదల అయిన ప్రోమోలో మితిమీరిన రొమాన్స్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మెహబూబ్, శ్రీసత్య కలిసి చేసిన డ్యాన్స్ లో రొమాన్స్ డోస్ ఎక్కువగా ఉంది. ఇది ఒక లెవల్ అంటే.. ఆ డ్యాన్స్ చూసి రాధ.. " నైట్ లైట్స్ ఆఫ్ చేసి ఇలా ఒక సెటప్ వేస్తే ఎంత బాగుంటుందో " అని చెప్పింది. ఒక జడ్జ్ స్థానంలో ఉండి ఇలా చెప్పడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.  ఆ తర్వాత సదా తనదైన శైలిలో.. "ఏం మాట్లాడాలి దీని గురించి.. వెరీ హాట్" అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఒక ఎపిసోడ్‌లో శ్రీముఖి వేసుకున్న పొట్టి డ్రెస్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా వీళ్ళ పర్ఫామెన్స్ హాట్ టాపిక్ గా మారింది. 

ఇంత అసభ్యకరమైన రొమాన్స్ తో కూడిన డ్యాన్స్ ని చూపిస్తూ.. సభ్యసమాజానికి  ఏం మెసెజ్ ఇస్తారంటూ ప్రేక్షకులు కామెంట్లు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే శని, ఆదివారాలలో టీవీలో ప్రసారమయ్యే ఈ డ్యాన్స్ ని కుటుంబసభ్యులతో చూడకుండా ఉండటమే బెటర్ అని విమర్శకులు భావిస్తున్నారు.