Read more!

English | Telugu

నేహా చౌదరి హోమ్ టూర్.. మరో మంచు లక్ష్మి!

నేహా చౌదరి.. బిగ్ బాస్ సీజన్-6 తో బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ హౌస్ మొదటి రెండు వారాలు బాగా టాస్క్ లు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత చంటితో గొడవ.. ఉమెన్స్ లో ఇనయాతో గొడవ కారణంగా ఎలిమినేషన్ దగ్గరి దాకా వచ్చి సేఫ్ అయింది. అయితే రేవంత్ తో జరిగిన గొడవ కాస్త ముదిరింది. అందులో అతని తప్పేం లేకున్నా రేవంత్ ని దూషించి, నోరు పారేసుకున్న నేహా.. ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక నేహాకి భారీ వెల్ కమ్ లభించింది.

బిగ్ బాస్ ముందు స్పోర్ట్స్ యాంకర్ గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ మహిళ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి అవార్డ్ కూడా వచ్చింది. సయ్యారే ప్రోగ్రామ్ లో యాంకర్ గా చేసి అవార్డ్ కూడా సొంతం చేసుకుంది. ఇలా యాంకరింగ్ తో పాటు పలు టీవీ షోస్, ప్రోగ్రామ్‌లు చేసిన నేహా చౌదరి క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే ఎప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో తన గురించి రెగ్యులర్ గా అప్డేట్స్ ని అందిస్తూ నేహా ఫ్యాన్స్ కి మరింత దగ్గరగా ఉంటుంది.

రీసెంట్ గా నేహా ఒక సినిమా షూటింగ్ నిమిత్తం పూణేకి వెళ్ళివచ్చింది. ఆ తర్వాత రెండు మూడు వ్లాగ్ లు చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. మన వంటకాలు నేర్చుకుంటున్న ఫారెనర్స్, బీచ్ లో యోగ, కాపురానికి వెళ్ళే ముందు ఇంటి పనులు నేర్పిస్తుంది అమ్మ లాంటి వ్లాగ్ లు చేసిన నేహా.. ఇప్పుడు తాజాగా వాళ్ళ ఇంటిని చూపిస్తూ 'నా హోమ్ టూర్' అని వ్లాగ్ చేసి అప్లోడ్ చేసింది. అయితే ఈ వీడియో అప్లోడ్ అయిన కొన్ని గంటల్లోనే లక్ష వ్యూస్ దాటాయి. దీన్ని బట్టి నేహా చౌదరికి ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది. అయితే తను చేసిన ఈ హోమ్ టూర్ లో.. వాళ్ళ అమ్మనాన్నలతో పాటు తమ్ముడిని కూడా పరిచయం చేసింది నేహా. అయితే వీడియో చివరలో తను ఎలాంటి పరిస్థితులలో వాళ్ళ ఇల్లు తీసుకుందో వివరించింది నేహా. ఇలా ప్రేక్షకులకి నేహా తన సొంత ఇంటిని పరిచయం చేసింది. కాగా ఈ వీడియో కింద కామెంట్ల వర్షం కురుస్తుంది. కొందరు ఈ వీడియో బాగుందని, నైస్ ఫ్యామిలీ అని పాజిటివ్ గా కామెంట్ చేయగా.. 'మరో మంచు లక్ష్మక్క' అని మరొకరు కామెంట్ చేసారు. పెళ్ళి అయింది కదా.. అలా స్లీవ్ లెస్ ఎందుకు? మంచిగా ఫుల్ గా వేసుకోవచచ్చు కదా అని మరికొందరు కామెంట్ చేసారు. మరి‌ నేహా వీటికి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.