Read more!

English | Telugu

బోన్ ఫ్రాక్చర్ తో నీతోనే డాన్స్ షో నుంచి తప్పుకున్న నేహా చౌదరి

నేహా చౌదరి నీతోనే డాన్స్ సీజన్ 2 లో విశ్వతో కలిసి పెర్ఫార్మ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఈ వారం ఎపిసోడ్ లో ఈ జోడి కనిపించలేదు. ఐతే ఈ వారం ప్రసారం ఐన షోలో అన్ని జోడీస్ పెర్ఫార్మ్ చేసాక చివరిగా స్టేజి మీదకి విశ్వా-నేహా వచ్చారు. ఐతే మెడకు బెల్ట్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఐతే తనకు మీద దగ్గర హెయిర్ లైన్ బోన్ ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పింది. షూటింగ్ స్టార్ట్ ఐన దగ్గర నుంచి ఆ నొప్పిని అలాగే భరిస్తూ చేస్తున్నాను  కానీ ఇంకా పెయిన్ ఎక్కువైపోయేసరికి భరించలేక హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్స్ అసలు విషయం  చెప్పారని చెప్పింది. ఇప్పటికైనా హాస్పిటల్ కి వచ్చావ్.. ఇదే పెయిన్ తో ఇంకొన్నాళ్ళు డాన్స్ చేసి ఉంటే బాడీ మొత్తం పెరలాసిస్ వచ్చేసి అసలు ఎందుకు పనికి రాకుండా పోయేదానివి అన్నారని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈ నీతోనే డాన్స్ షోకి ఇక వచ్చే పరిస్థితి లేదని చెప్పింది. వెంటనే సదా వచ్చి ఏడుస్తూ నేహాని హగ్ చేసుకుంది. ఇక నేహా లేకపోతే విశ్వా ఒక్కడే పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉండదు కాబట్టి నేహా ప్లేస్ లోకి వేరే వారిని తీసుకొస్తామని తరుణ్ మాష్టర్ చెప్పారు. 

ఇక నేహా పెర్ఫార్మెన్స్ కి సదా ఫస్ట్ టైం గోల్డెన్ హార్ట్ ఇచ్చింది, తరుణ్ మాష్టర్ కూడా గోల్డెన్ పేపర్ చింపారు, రాధ నూటికి నూరు మార్కులు ఇచ్చారు. అందుకే అవన్నీ కూడా ఒక జీన్ షర్ట్ మీద అతికించి ఆ షర్ట్ ని నేహాకి ప్రెజెంట్ చేశారు సదా, శ్రీముఖి. ఇక నేహాకి రీసెంట్ గా పెళ్లయ్యింది. ఐతే ఈ షో కోసం ఆమె విదేశాల నుంచి వచ్చి పెర్ఫార్మ్ చేసింది. నేహాకి బహుశా దిష్టి తగిలిందేమో అని శ్రీముఖి కొంచెం ఫీలయ్యింది.