Read more!

English | Telugu

బౌన్సర్ జాబ్ ఖాళీగా ఉంది అంటూ రోహిణికి హింట్ ఇచ్చిన నాని

ఉగాది మాస్ ధమాకా ఈవెంట్ అవార్డ్స్ మరో ప్రోమో రిలీజ్ చేసింది. ఉగాది మరి కొద్ది రోజుల్లో రానున్న సందర్భంగా చానెల్స్ అన్నీ కొత్త కొత్త ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్నాయి. ఇక ఈ షోకి ఊర మాస్ నేచురల్ స్టార్ నాని షోలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసాడు. ఉంగరాల జుట్టుతో ఫుల్ బబ్లీ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ షోకి తన లేడీ ఫాన్స్ కూడా వచ్చారు. రీతూ చౌదరి నాని చూసి తన గుండె 72 సార్లు కాకుండ 172 సార్లు కొట్టుకుంటోంది అని ఆయన మీద ఇష్టాన్ని చెప్పేసరికి బిపి టాబ్లెట్స్ వేసుకో అని నాని సలహా ఇచ్చాడు. ఇక పాగల్ పవిత్ర వచ్చి ఒక్కసారి టచ్ చేస్తారా ప్లీజ్ మిమ్మల్ని టచ్ చేయాలంటే నా చెయ్యి చూసారా ఎలా షివర్ అవుతుందో అనేసరికి ఆమె చేతిని టచ్ చేసాడు నాని. దాంతో పవిత్ర కరెంటు పాస్ ఐనట్టు బిల్డప్ ఇచ్చేసింది.

దాంతో నాని "ఎవుర్రా నువ్వు ఇంత టాలెంట్ గా ఉన్నావ్" అంటూ ఒక డైలాగ్ చెప్పి శ్రీముఖికి హైఫై ఇచ్చాడు.  ఇక సీన్ లోకి రౌడీ రోహిణి ఎంట్రీ ఇచ్చింది. "నువ్వేం భయపడమాకు బావ..నీ ఎనకమాల ఎంతమంది అమ్మాయిలు వచ్చినా నేను చూసుకుంటా" అనేసరికి "పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు బౌన్సర్స్ ని పెడతారు కదా ఆ జాబ్ ఖాళీగా ఉంది" అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. నాజ్రియా ఇమేజ్ ని శ్రీముఖి చూపించేసరికి ఆమె చాలా నాటీగా ఉంటుంది అని చెప్పాడు నాని. తర్వాత సాయి పల్లవి ఇమేజ్ ని చూపించి అడిగేసరికి ఉగాది పచ్చడిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ చేదు కదా అని చెప్పాడు. చాలా బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ చేసింది అన్నాడు.

తర్వాత సిల్క్ స్మితకి ట్రిబ్యూట్ పేరుతో స్పెషల్ డాన్స్  పెర్ఫార్మెన్స్ చేసింది భానుశ్రీ. ఎప్పటికైనా సిల్క్ స్మిత ఓన్లీ వన్ ఇంకెవ్వరూ ఆమెలా లేరు, రారు అని చెప్పాడు నాని.  స్టేజి మీద వెరైటీ క్రికెట్ కూడా ఆడాడు నాని. మరి ఈ షో ఉగాది ఫుల్ ఎంటర్టైన్ చేయబోతోంది అన్న విషయం అర్ధమవుతోంది. మరి ఈ ఈవెంట్ లో ఎలాంటి సెగ్మెంట్స్ ఉన్నాయి..నాని కానీ ఇతర గెస్ట్స్ కానీ ఎలాంటి పంచ్ డైలాగ్స్ వేసారో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.