English | Telugu

నా లైఫ్ ఫ్యామిలీకే అంకితం!

బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. పలు షోలలో యాంకరింగ్ చేస్తూ బిజీగా మారింది. వరుస షోలతో బిజీగా ఉన్న సమయంలోనే ఆమెకి బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చింది. ఫైనల్స్ వరకు వచ్చిన ఆమె రన్నరప్ గా నిలిచింది. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపించే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లను షేర్ చేస్తూ తన గ్లామర్ తో యూత్ ను ఆకట్టుకుంటోంది.

రీసెంట్ గా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఈ భామ ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై స్పందించింది. తను పెళ్లి చేసుకోవాలంటే ముందు ఆర్థికంగా సెటిల్ అవ్వాలని చెబుతోంది ఈ బ్యూటీ. నిజానికి శ్రీముఖి గతంలో ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉంది. కానీ అతడు తనకు పెళ్లైన విషయాన్ని చెప్పకుండా మోసం చేయడంతో ఆ రిలేషన్ కి బ్రేకప్ చెప్పేశానని తెలిపింది. ఫ్యూచర్ లో కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటానని చెబుతోంది శ్రీముఖి.

అయితే మరో రెండేళ్ల వరకు పెళ్లి ఆలోచన చేయనని అంటోంది. ప్రస్తుతం తాను బిజీగా ఉండడం వలన ఇంట్లో కూడా ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పింది. పెళ్లి తరువాత లైఫ్ మొత్తం ఫ్యామిలీకే అంకితం చేస్తానని అంటోంది. అయితే పెళ్లికి ముందు ఆర్థికంగా సెటిల్ అవ్వాలని.. ఆ ఒక్కటి చేసిన తరువాతే పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇన్నోసెంట్ గా ఉండాలని.. తనతో చనువుగా ఉండాలని మనసులో కోరికను బయటపెట్టింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.