Read more!

English | Telugu

కృష్ణని అడ్డుతొలగించే ప్రయత్నంలో ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ ఎపిసోడ్ -75 లోకి అడుగుపెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో.. కృష్ణ ఇంటి నుండి బయటికి వెళ్లిపోదామని బట్టలు సర్దుతుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మురారి.. "ఏంటి కృష్ణా.. ఎక్కడికి వెళ్తావ్.. వద్దు" అని అంటాడు. "లేదు ACP సర్.. నేను మా ఊరు వెళ్ళిపోతాను. నేను చదువుకోవాలి. మా అమ్మ నాన్నల కలని నెరవేర్చాలి. నాకు ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఎప్పుడు ప్రేమగా చూసే అత్తయ్య కూడా.. ఈ రోజు నువ్ చదువుకోవద్దు అని చెప్పారు" అని కృష్ణ అనగానే.. లేదు కృష్ణ నేను అమ్మతో మాట్లాడుతా అని మురారి అంటాడు. ఇప్పుడు వెళ్తే మా ఊరికి బస్సులు ఉంటాయో, ఉండవో.. మీరు దింపేసి వస్తారా అని కృష్ణ అనగానే.. "నేను ఏం అంటున్నాను. నువ్వు ఎం అంటున్నావ్" అని మురారి అంటాడు. ఆటో వాడికి డబ్బులు ఇవ్వాలంటే. నా దగ్గర చేంజ్ లేవు. అయిదువందలకి చేంజ్ ఇస్తారా అని కృష్ణ అనగా.. "ఏంటి కృష్ణ ఇలా మాట్లాడుతున్నావ్" అని చెయ్యి పట్టుకొని మురారి ఆపే ప్రయత్నం చేస్తాడు. మీరు వదలండి అని కృష్ణ అనగానే బయటికి వెళ్తాడు మురారి. 

బయట ఉన్న మురారి దగ్గరికి ముకుంద వచ్చి.. "పాపం కృష్ణ.. తనకు చదువుకోవాలని ఉంది. తన కలని నెరవేర్చే బాధ్యత నీదే. నా కోపం నీ మీదే, కృష్ణ మీద కాదు" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏంటి ముకుంద ఈ రోజు కృష్ణ గురించి ఇంత పాజిటివ్ గా ఆలోచిస్తుందని అనుకుంటాడు మురారి.

మరోవైపు రేవతి దగ్గరికి కృష్ణ వచ్చి.. "అత్తయ్యా.. నేను చదువుకుంటాను" అని అడుగుతుంది. "లేదు కృష్ణ నువ్వు చదవడం వీలు కాదు. ఇంకో రెండు సంవత్సరాల తర్వాత చదువుకో" అని అంటుంది. ఇప్పుడు ఎందుకు వద్దు రెండు సంవత్సరాల తర్వాత ఎందుకు అత్తయ్య అని కృష్ణ అడుగగా.. నీకు కొత్తగా పెళ్లి అయ్యింది. మురారిని దగ్గర ఉండి చూసుకోవాలని అనగానే.. "మురారిని ఎవరైనా ఎత్తుకుపోతారా" అని కృష్ణ అంటుంది. అప్పుడు ముకుంద ఎత్తుకుపోతుందని మనసులో అనుకుంటుంది రేవతి. ఇప్పుడు చదువు వద్దని రేవతి చెప్పగా సరేనని కృష్ణ అంటుంది. మరోవైపు మురారి ఆలోచిస్తూ.. అసలు కృష్ణ గురించి ముకుంద మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. అమ్మ ఎందుకు కృష్ణని చదువుకోవద్దని అంటుంది. నా గురించి ముకుంద గురించి అమ్మకి తెలిసిపోయిందా అని అనుకుంటాడు.

కృష్ణని చదువు పేరుతో ఎలాగైనా దూరం పంపించేస్తే మురారితో ఉండొచ్చని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.